సినిమా

Ram Gopal Varma : ఆనందయ్య కిడ్నాప్ కాకుండా చూడండి: ఆర్జీవీ

Ram Gopal Varma : ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య గురించి టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు.

Ram Gopal Varma : ఆనందయ్య కిడ్నాప్ కాకుండా చూడండి: ఆర్జీవీ
X

Ram Gopal Varma : ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య గురించి టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. "ఎయిర్ ఫోర్స్ వన్లో కృష్ణపట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, డా.ఫౌసీ వెళ్తున్నారని విన్నాను. ఆనందయ్యతో కరోనా రెసిపీ కోసం డీల్ కుదుర్చుకోవడానికై అయ్యుండొచ్చు. ఆయన కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి, మిలిటరీ భద్రత కల్పించవచ్చు కదా" అని వర్మ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ''పైజర్, మోడెర్నా వంటి వ్యాక్సిన్ నిపుణులే తమ ఫార్ములాను ఎవరికీ షేర్ చేయలేదు. అలాంటిది, ఆనందయ్య మాత్రం ఎవరు అడిగితే వారికి ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఆనందయ్యకు ఎట్టిపరిస్థితుల్లోనూ నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే.'' అంటూ మరో ట్వీట్ చేశారు. కాగా మరోవైపు అనందయ్య కరోనా మందు పైన ఆయుష్, ICMR బృందాల అధ్యయనం పదిరోజుల్లో పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు.


Next Story

RELATED STORIES