Ram Gopal Varma : నక్సలైట్ గెటప్‌లో వర్మ.. మాములు రచ్చ చేయలేదుగా..!
Ram Gopal Varma : నిత్యం వివాదాలతో వార్తల్లో నిలవడం ఆర్జీవి స్టైల్.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారాయన..

Ram Gopal Varma : నిత్యం వివాదాలతో వార్తల్లో నిలవడం ఆర్జీవి స్టైల్.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారాయన.. లేటెస్ట్ గా వర్మ చేస్తోన్న మూవీ కొండా.. వరంగల్‌కు చెందిన పొలిటికల్ లీడర్స్ కొండా మురళి-సురేఖ దంపతుల జీవి కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు వర్మ.. ఈ సినిమా షూటింగ్ తాజాగా కంప్లీట్ అయింది.. ఈ సందర్భంగా వరంగల్‌లోని గోపాల్‌పూర్ కొండామురళి గెస్ట్‌హౌస్‌లో ముగింపు వేడుక నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కొండా మురళి, కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ వేడుకల్లో వర్మ నక్సలైట్ గా కనిపించాడు.. పెద్ద తల్వార్‌తో కేకును ముక్కలు ముక్కలుగా కోశాడు. దీనికి సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. కిల్లింగ్ ఏ కేక్ ఫర్ కొండా అంటూ రాసుకొచ్చాడు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. సినిమా త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
KILLING a CAKE for KONDA pic.twitter.com/BXMmJIpV5F
— Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2021
RELATED STORIES
Mamata Banerjee: పార్టీకి కొత్త చిక్కులు.. టీఎంసీ అధినేత్రి మమతలో...
13 Aug 2022 3:00 PM GMTHaryana: అమ్మకు ఎఫైర్.. కడతేర్చిన కొడుకు..
13 Aug 2022 11:36 AM GMTLadakh Bike Rally : లద్దాక్‌లో తిరంగా బైక్ ర్యాలీ..
13 Aug 2022 9:00 AM GMTSonia Gandhi : సోనియాకు మళ్లీ కరోనా.. మూడు నెలల్లో రెండవ సారి..
13 Aug 2022 8:30 AM GMTPM Modi : నెల రోజుల్లో భారత్ రెండు గొప్ప విజయాలను సాధించింది : ప్రధాని...
13 Aug 2022 7:51 AM GMTChenab Railway Bridge : జమ్ము కశ్మీర్లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే...
13 Aug 2022 7:01 AM GMT