Ravibabu : మా ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు.. అవి కేవలం వదంతులు మాత్రమే.. !
Ravibabu : నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత దర్శకుడిగా మారి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు రవిబాబు.. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తీయడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. రవిబాబు డైరెక్షన్‌లో పూర్ణ హీరోయిన్‌గా మూడు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. దీనితో వారిమధ్య ఎదో నడుస్తోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టుకొచ్చాయి. వీటిపైన అటు పూర్ణ కానీ ఇటు రవిబాబు కానీ ఇన్నిరోజులు స్పందించలేదు. తాజాగా ఈ వార్తల పైన రవిబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. షూటింగ్ అయిపోయాక తాను హీరోయిన్లను కలవనని చెప్పుకొచ్చాడు. ఇక పూర్ణ అభినయం చూసే ఆమెను మూడు సినిమాల్లో తీసుకున్నానని అంతకుమించి మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. కాగా రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన 'అవును', 'అవును 2', 'లడ్డుబాబు' సినిమాల్లో పూర్ణ నటించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com