RGV: పవన్ స్పీచ్.. వర్మ కామెంట్

RGV: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భీమ్లానాయక్.. మలయాళీ సూపర్‌హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్‌కి ఇది రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకులను, ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దింది చిత్ర యూనిట్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పాత్ర కూడా కొంత కావడం ఈ చిత్రం మరింత హైప్‌ని క్రియేట్ చేసింది.
శుక్రవారం ఉదయం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించింది చిత్ర బృందం. ఇందులో భాగంగా పవన్ మాట్లాడుతూ.. సినిమా కోసం పని చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈవెంట్‌లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధం ఈ సినిమా అని సింపుల్‌గా చెప్పేశారు పవన్.
కాగా, దర్శకుడు రాంగోపాల్ వర్మ పవన్ స్పీచ్‌పై కామెంట్ చేశారు. ట్విట్టర్ వేదికగా పవన్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.. భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ స్పీచ్ ఎంతో హూందాగా ఉందని అన్నారు. ఆయన ప్రవర్తించిన తీరు మర్యాదపూర్వకంగా ఉందని తెలిపారు. అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యారు అని ట్వీట్ చేశారు. ఇక పవన్ ఇచ్చిన ఈ వీడియోని షేర్ చేస్తూ.. ఇప్పటి వరకు పవన్ ఇచ్చిన స్పీచుల్లో బెస్ట్ స్పీచ్ ఇదే అంటూ పవన్ కళ్యాణ్‌ని ఆకాశానికి ఎత్తేశారు ఆర్జీవి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com