RGV : ఇంత అందంగా ఉన్న నువ్వు నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నావ్ : ఆర్జీవీ

RGV : వర్మ అంటేనే కాస్త డిఫిరెంట్.. నలుగురికి నచ్చింది చేయడు.. ఏం చేసిన ఆ నలుగురు తన గురించి మాట్లాడుకునేలా చేస్తాడు.. అది సినిమా అయిన, ట్వీట్ అయిన, స్పీచ్ అయిన.. అందుకే వర్మ ఎప్పుడు వార్తల్లో ఉంటారు.
ఇక అమ్మాయిలని పొగడకుండా అస్సలు ఉండలేడు.. హీరోయిన్స్ నుంచి యాంకర్స్ వరకు నచ్చితే వారి అందం గురించి నిర్మొహమాటంగా పోగిడేస్తాడు.. తాజాగా మరో తెలుగు యాంకర్ ని తనదైన శైలిలో పొగిడేసి టాక్ అఫ్ ది టౌన్ అయ్యాడు వర్మ. ఇంతకీ ఏం జరిగిందంటే.. అల్లు అర్జున్ పుష్ప మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైన కన్నడ నటుడు ధనుంజయ్.. ఇప్పుడు తన 'బడవ రాస్కెల్' సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడు.
ఫిబ్రవరి 18న ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్ కానుంది. అయితే మూవీ ప్రమోషన్‌లో భాగంగా తాజాగా చిత్రయూనిట్ మంగళవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి చీఫ్ గెస్ట్‌గా దర్శకుడు వర్మ హాజరయ్యారు.
అయితే ఈ ప్రోగ్రాంని హోస్ట్ చేస్తోన్న యాంకర్ శ్యామల గురించి మాట్లాడుతూ "అసలు ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఇన్నాళ్లు ఎలా తప్పించుకున్నారు" అంటూ కామెంట్ చేసాడు వర్మ.. దీనికి శ్యామల ఆశ్చర్యపోతు సిగ్గుపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com