Manju Warrier: స్టార్ హీరోయిన్‌కు వేధింపులు.. ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్..

Manju Warrier: సినీ పరిశ్రమలో వేధింపులకు గురవుతున్న మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉంటారని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. బయటవారికంటే సినీ రంగంలోనే వేధింపులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని చాలామంది భావన. అయితే కొన్ని సంఘటనలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఇటీవల మాలీవుడ్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువయిపోతున్నాయి. తాజాగా ఓ సీనియర్ నటి వేధింపులకు గురికావడం సంచలనం సృష్టించింది.
మాలీవుడ్‌లో వేధింపులకు గురవుతున్న మహిళల సంఖ్య ఎక్కువవుతోంది. మొన్నటికి మొన్న ప్రముఖ నటుడు విజయ్ బాబుపై అత్యాచార ఆరోపణలు చేసింది ఓ నటి. అది మరువక ముందే ఓ ప్రముఖ డైరెక్టర్ తనను వేధించాడంటూ ఓ సీనియర్ నటి పోలీస్ కేసు పెట్టడం సంచలనంగా మారింది. నటి చెప్పినట్టుగా కేసు ఫైల్ చేసి ఆ డైరెక్టర్‌ను అదుపులోకి కూడా తీసుకున్నారు పోలీసులు.
మంజు వారియర్.. ఈ పేరుకు మాలీవుడ్‌లో పెద్దగా పరిచయాలు అవసరం లేదు. 40 ఏళ్ల వయసు దాటినా.. ఇంకా యంగ్‌గా కనిపిస్తూ చాలామందికి క్రష్ అయిపోయింది. ప్రముఖ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌తో 'కయాట్టం' అనే సినిమాను చేసింది మంజు. అయితే ఆ చిత్ర షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా సనల్ తనకు మెసేజ్‌లు చేసి వేధిస్తు్న్నాడని ఫిర్యాదు చేయడంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు సనల్‌ను అరెస్ట్ చేసి కొచ్చికి తరలించారు. కాగా సనల్ కుమార్ దర్శకత్వం వహించిన ప్రతీ చిత్రానికి ఏదో ఒక అవార్డ్ అందుకోవడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com