Director Shankar : శంకర్ ఫ్లాపుల కంటే ఇదే అత్యంత ప్రమాదం

Director Shankar :  శంకర్ ఫ్లాపుల కంటే ఇదే అత్యంత ప్రమాదం
X

సీనియర్ డైరెక్టర్ గా, ప్యాన్ ఇండియా దర్శకుడుగా శంకర్ సృష్టించిన మాయాజాలాలు అనేకం. ఇండియన్ సినిమా ఆశ్చర్యపోయిన విజువల్స్ ను అందించిన దర్శక మేధావి. కంటెంట్ పరంగా, కమర్షియల్ స్టాండర్డ్స్ లోనూ శంకర్ విజన్ మరే దర్శకుడికీ రాలేదు. ఇదంతా ఒకప్పటి శంకర్ గురించి. ఇప్పటి శంకర్ కమర్షియల్ గా పూర్తిగా గాడి తప్పాడు. అయితే అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ శంకర్ ఫ్లాపులు, హిట్లు కంటే ఒక విషయం నిర్మాతలకు తీవ్రమైన ఇబ్బందులు తెస్తోంది. అదే.. అదుపు లేని బడ్జెట్. అతని సినిమాలన్నీ భారీ బడ్జెట్ వే. అది తెరపై కనిపించే అంశం. కానీ తెర వెనక అంతకు మించిన బడ్జెట్ ను పెట్టిస్తాడు శంకర్. ఈ విషయంలో ఏ నిర్మాతా అతన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదింత వరకూ. పైగా సెట్స్ పైకి వచ్చిన తర్వాత అత్యంత కాస్ట్ లీ మెటీరియల్ అడుగుతూ నిర్మాతలకు, ప్రొడక్షన్ మేనేజర్ లకు చుక్కలు చూపిస్తాడనే పేరు ఎటూ ఉంది. ఇక తాజాగా అతని గేమ్ ఛేంజర్ మూవీకి ఎడిటింగ్ అందించిన షమీర్ మహ్మద్ ఓ మళయాల యూ ట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పాడు. ఇవన్నీ ఇన్నేళ్లుగా భరిస్తోన్న నిర్మాతల బాధ చూస్తే చాలామంది జాలి పడతారు అని అతని మాటలు చూస్తే అర్థం అవుతుంది.

గేమ్ ఛేంజర్ మూవీ నిడివి 2 గంటల 45 నిమిషాలు. అలాంటి మూవీకి ఏకంగా 7న్నర గంటల ఫుటేజ్ తీశాడట శంకర్. ఆ ఏడున్నర గంటల ఫుటేజ్ నుంచి రెండూ ముఫ్ఫావు గంటల అవుట్ పుట్ తీశారు ఎడిటర్స్. అంటే మనం తెరపై చూసిన విజువల్ గ్రాండీయర్ ఈ రేంజ్ లో ఉంటే మిగిలిన భాగం విజువల్ గా ఎలా ఉందో, అందుకోసం నిర్మాతతో పెట్టించిన ఖర్చు ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. సినిమాలో కనిపించలేదు అంటే అది ఇంకే సినిమాలోనూ వాడలేరు. అంటే అదంతా వృథా ఖర్చు అన్నట్టే కదా. అదే శంకర్ గురించి చెప్పేది. అతను తీసే ఫ్లాపుల కంటే ఇలాంటి వృథా ఖర్చుల వల్లే నిర్మాతలు భారీగా నష్టపోతుంటారు. ఆ ఖర్చును ఏ రకంగానూ రికవర్ చేసుకోలేరు. ఫ్లాప్ మూవీస్ కైనా ఓటిటి, డిజిటల్ రైట్స్ ఉంటాయి. కానీ ఈ వేస్టేజ్ ను ఎవరు తీసుకుంటారు. అలాగని యూ ట్యూబ్ లో పెట్టినా యూజ్ ఉంటుందా అంటే అదీ చెప్పలేం. బట్ .. శంకర్ లాంటి దర్శకులు ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీలే ఇబ్బందుల్లో పడిపోతుంటాయి. నిర్మాతలను ఇంత దారుణంగా మోసగించి ముంచితే ఏ పరిశ్రమ మాత్రం బాగు పడుతుంది..?

Tags

Next Story