NTR : శంకర్- ఎన్టీఆర్ కాంబో.. ఆ రోజునే అభిమానులకి డబుల్ ట్రీట్..!

NTR : రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన RRR మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్... ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమాని చేస్తున్నాడు.. ఎన్టీఆర్‌కి ఇది 30వ సినిమా కావడం విశేషం. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు తారక్.. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా మే 20న అభిమానులకి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు తారక్ రెడీ అయినట్టుగా తెలుస్తోంది.
ఒకటి కొరటాల, ఎన్టీఆర్ మూవీ అదే రోజున ఓపెనింగ్ కానుందని, ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమా టైటిల్‌ని అనౌన్స్ చేసే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.. ఇక మరోకటి స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్‌కు సరిపోయే కథను శంకర్ సిద్ధం చేసి వినిపించారని వినికిడి.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుందని టాక్ నడుస్తోంది.
ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా సెట్అయితే ఈ సినిమా మరో రేంజ్‌లో ఉంటుందనంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ప్రస్తుతం శంకర్ రామ్‌చరణ్ తో ఓ సినిమాని చేస్తున్నారు. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com