Director Shankar : 'రాజమౌళి మీ ఊహాశక్తికి హ్యాట్సాఫ్' : RRR పై శంకర్..!

Director Shankar : టాలీవుడ్ జక్కన్న చెక్కిన మరో అపురూప దృశ్యకావ్యం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం).. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్‌లో తెరకెక్కిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ ఈ నెల(మార్చి) 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించి అదరగొట్టారు.
సినిమాకి మార్నింగ్ షో నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో కలెక్షన్ల పరంగా ఆర్ఆర్ఆర్ అదరగొడుతోంది. అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సినిమాని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్.. ఆర్ఆర్ఆర్ మూవీపై తనదైన శైలిలో స్పందించారు.
"సినిమాలో రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్.. ఎన్టీఆర్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ నిలిచిపోతాయి.. రాజమౌళి మీ ఊహాశక్తికి హ్యాట్సాఫ్" అంటూ శంకర్ ట్వీట్ చేశాడు.అద్భుతమైన సినిమాని తెరకెక్కించారని జక్కన్నని పొగడ్తలతో ముంచెత్తాడు.
Ravishing,Riveting,Robust.A Roar that'll echo throughout times.Thanks to the whole team for an unparalleled experience.@AlwaysRamCharan-Raging Performance & Screen presence.@tarak9999 's Radiant Bheem captivates your heart.Ur imagination stays undefeated,hats off "MahaRaja"mouli.
— Shankar Shanmugham (@shankarshanmugh) March 25, 2022
మరోవైపు శంకర్ తెలుగులో డైరెక్ట్‌గా రామ్ చరణ్‌తో నెక్ట్స్ సినిమాని చేస్తున్నారు. ఇందులో చరణ్ ఒక ప్రభుత్వ అధికారిక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి సర్కారోడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com