Premistava Trailer : దూకుడు పెంచిన శంకర్ కూతురు

Premistava Trailer :  దూకుడు పెంచిన శంకర్ కూతురు
X

ఇండియాస్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడైన శంకర్ ఇతర దర్శకులకు భిన్నంగా తన కూతురు అదితి శంకర్ ను హీరోయిన్ గా చేయడానికి ఇబ్బంది పడలేదు. ఆమె ఆశకు అడ్డు చెప్పలేదు. మొదట సింగర్ గా పరిచయమైన తను తర్వాత హీరోయిన్ గా మారింది. మొదట్లో సెలెక్టివ్ మూవీస్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది అదితి. స్టన్నింగ్ బ్యూటీ కాకపోయినా బ్యాక్ గ్రౌండ్ తో పాటు తన ఛలాకీ తనంతో అందరి అటెన్షన్ ను సంపాదిస్తోంది. ప్రస్తుతం తెలుగులోనూ భైరవం చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడీగా నటిస్తోంది. ఈ మూవీతో తను తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఈ మాత్రం క్రేజ్ తోనే తను నటించిన ఓ తమిళ్ మూవీని తెలుగులో డబ్ చేయబోతుండటం విశేషం.

రీసెంట్ గా సంక్రాంతి బరిలో తమిళ్ లో విడుదలైన మూవీ ‘నేసిప్పయా’. పవన్ కళ్యాణ్ తో పంజా మూవీని రూపొందించిన విష్ణువర్ధన్ ఈ చిత్రానికి దర్శకుడు. కంప్లీట్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీకి అక్కడ మిక్స్ డ్ రివ్యూసే వచ్చాయి. కాకపోతే అదితి నటన పరంగా చాలా మార్కులు కొట్టేసింది. ఈ మూవీతో ఆకాశ్ మురళి అనే కొత్త హీరో తమిళ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అతనూ ఆకట్టుకున్నాడు. వీరితో పాటు శరత్ కుమార్, ఖుష్బూ, కల్కి కొచ్చిన్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని ఇప్పుడు తెలుగులో ‘ప్రేమిస్తావా’పేరుతో డబ్ చేయబోతున్నారు. తాజాగా ఈ ప్రేమిస్తావా ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్ ఆకట్టుకునేలానే ఉంది. లవ్, ఎమోషన్, యాక్షన్, పెయిన్, సంఘర్షణ వంటి ఎలిమెంట్స్ తో ఇంట్రెస్టింగ్ గానే ఉంది ట్రైలర్. కాకపోతే ట్రైలర్ బావున్నంత మాత్రం సినిమా కూడా బావుండాలనేం లేదు కదా. అందుకే ఈ మూవీకి అక్కడ మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. అదే టైమ్ లో అక్కడ ఆకట్టుకోని కొన్ని సినిమాలు వేరే భాషల్లో మెప్పిస్తాయి. అలా ఈ మూవీ తెలుగులో అలరిస్తుందేమో చూడాలి. అన్నట్టు ఈ చిత్రాన్ని ఈ నెల 30నే తెలుగులో విడుదల చేస్తున్నారు.

Tags

Next Story