ఘనంగా శంకర్‌ కుమార్తె వివాహం, హాజరైన సీఎం..!

ఘనంగా శంకర్‌ కుమార్తె వివాహం, హాజరైన సీఎం..!
తమిళ అగ్ర దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య వివాహం క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో ఈ రోజు(ఆదివారం) జరిగింది.

తమిళ అగ్ర దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య వివాహం క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో ఈ రోజు(ఆదివారం) జరిగింది. తమిళనాడులోని మహాబలిపురంలో అత్యంత సన్నిహితుల మధ్యన ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా రోహిత్‌ దామోదరన్‌ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్‌ లీగ్‌లో ఆడుతున్నాడు. అటు ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు కావడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story