Director Shankar : క్రికెటర్ తో స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి..!

Director Shankar : దక్షణాది సినీ పరిశ్రమలో అగ్ర దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్న శంకర్ ఇంట్లో త్వరలో పెళ్లి భాజాలు మొగబోతున్నాయి. ఆయన కుమార్తె ఐశ్వర్య వివాహం క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో జరగబోతోంది. కరోనా నేపధ్యంలో జరుగుతున్న పెళ్లి కావడంతో వీరి వివాహాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. కాగా శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తి రీత్యా డాక్టర్. అటు రోహిత్ దామోదరన్ తండ్రి దామోదరన్ పారిశ్రామికవేత్త. అంతేకాదు మధురై పాంథర్స్ టీమ్ జట్టుకు స్పాన్సర్ కూడా. ఈ ఏడాది మే నెలలో శంకర్ తల్లి కన్నుమూశారు. ఈ విషాదం తర్వాత దర్శకుడు శంకర్ ఇంట్లో జరుగుతున్న తొలి శుభకార్యం ఇదే కావడం విశేషం. ఇక శంకర్ సినిమాల విషయానికి వచ్చేసరికి రామ్ చరణ్ తో ఒక పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో అపరిచితుడు సినిమాని రీమేక్ చేస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com