Ramarao On Duty : సినిమా టైటిల్‌లో రామారావు అని పెట్టడానికి కారణమదే : శరత్ మండవ

Ramarao On Duty : సినిమా టైటిల్‌లో రామారావు అని పెట్టడానికి కారణమదే : శరత్ మండవ
Ramarao On Duty : రవితేజ శరత్ మండవ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా జులై 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది

Ramarao On Duty : రవితేజ శరత్ మండవ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ సినిమా జులై 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా టైటిల్‌లో రామారావు అని ఉంది. ఈ పేరునే దర్శకుడు శరత్ ఎందుకు ఎంచుకున్నాడోనని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రామారావు అనే పేరుకు పరిచయం అవసరం లేదన్నారు.

ఎప్పుడు సర్వే పెట్టినా స్వర్గీయ ఎన్టీరామారావు గారికి నంబర్ వన్ తెలుగు పర్సనాలిటీగా నిలబడతారని ఓ సర్వే తెలిపింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్, రాజకీయాల్లో కేటీఆర్.. ఇలా తెలుగునాట ఫేమస్ పవర్ఫుల్ పర్సనాలిటీలందరూ రామారావులే కాబట్టి సినిమాకు రామారావు ఆన్ డ్యూటీ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఓ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో మాస్ రాజ రవితేజ కనిపించబోతున్నారు.

Tags

Next Story