Tollywood: సిల్క్ స్మితపై తనకున్న ప్రేమ గురించి చెప్పిన దర్శకుడు!

Tollywood: సిల్క్ స్మితపై తనకున్న ప్రేమ గురించి చెప్పిన దర్శకుడు!
Tollywood: టాలీవుడ్‌లో శ్రీకాంత్ ఓదెల ఓ గొప్ప డైరెక్టర్ అవబోతున్నాడని దసరా హీరో నాని చెప్పాడు.

Tollywood: టాలీవుడ్‌లో శ్రీకాంత్ ఓదెల ఓ గొప్ప డైరెక్టర్ అవబోతున్నాడని దసరా హీరో నాని చెప్పాడు. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి భారీ బజ్ క్రియేట్ చేసింది. భారీ సిల్క్ స్మిత పోస్టర్ ముందు నాని కూర్చోవడం.. ఏంటి ఈ సినిమాకు, సిల్క్ స్మితకు సంబంధం అని ప్రేక్షకులు అనుకునేలా చేసింది. దివంగత నటి ట్రైలర్‌లో కూడా కనిపించింది. దర్శకుడికి ఆమె పట్ల ప్రత్యేక అభిమానం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఇంటర్వ్యూలో, కీర్తి సురేష్ ఇదే విషయమై దర్శకుడిని అడిగారు. అప్పుడు శ్రీకాంత తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. తన తాతకు కాలు విరిగినప్పుడు కల్లు తీసుకురావడానికని దుకాణానికి వెళ్లారట. అక్కడ సిల్క్ స్మిత పోస్టర్‌ని మొదటి సారి చూశానని శ్రీకాంత్ వెల్లడించారు. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో శ్రీకాంత్‌కి ఆమె నటి అని తెలియకపోయినా ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆమె పోస్టర్‌ని చూసేందుకు అతను తరచూ దుకాణానికి వెళ్లేవాడట. అదే అభిమానం ఆమె పోస్టర్‌ను 'దసరా'లో చేర్చేలా చేసింది అని దర్శకుడు తన చిన్ననాటి జ్ఞాపకాలను, నోస్టాల్జిక్ క్షణాలను కూడా సినిమాలో పొందుపరిచారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా ఈ రోజు థయేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

Tags

Read MoreRead Less
Next Story