సినిమా

Trivikram : త్రివిక్రమ్‌ మల్టీస్టారర్‌.. పవన్ కళ్యాణ్‌‌తో సాయి ధరమ్ తేజ్..!

Trivikram : ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌‌తో భీమ్లానాయక్ మూవీ చేస్తున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారాయన.

Trivikram : త్రివిక్రమ్‌ మల్టీస్టారర్‌.. పవన్ కళ్యాణ్‌‌తో సాయి ధరమ్ తేజ్..!
X

Trivikram : ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌‌తో భీమ్లానాయక్ మూవీ చేస్తున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారాయన.. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని అన్ని కుదిరితే ఈ నెలలో రిలీజ్ చేయనున్నారు. ఆ సినిమా తర్వాత పవన్‌‌తో మరో సినిమా చేసేందుకు సిద్దమయ్యారు త్రివిక్రమ్.. అయితే ఇది కూడా మల్టీస్టారర్‌ మూవీ అవుతుండడం విశేషంగా చెప్పుకోవాలి.

తమిళ చిత్రం వినోదయ సితం అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు పవన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిచనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ZEE స్టూడియోస్ కలిసి ఈ రీమేక్‌ని సంయుక్తంగా నిర్మించున్నాయి. అయితే ఈ సినిమాలో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నాడని తెలుస్తోంది.

దీనిపైన త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. మెగా హీరోలు, అందులోనూ మామఅల్లుళ్ళు కలిసి ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారని తెలియడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Next Story

RELATED STORIES