Vijay Thalapathy GOAT : ది గోట్ .. డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబోలో వచ్చిన మూవీ ‘ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’. ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై హైప్ ను మరింత పెంచింది. విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ ఆడియెన్స్ దీని స్టోరీ, స్క్రీన్ ప్లేను గెస్ వేయలేరు. నేను ఈ విషయంలో సవాల్ చేస్తా. సినిమా ఎటువెళ్తుందో చెప్పలేరు. నేను ట్రైలర్‌లోనే ఈ స్టోరీ జానర్ ను చెప్పారు. కానీ ఒక్కరు కూడా సరిగా ఊహించలేదు. స్టోరీ సింపుల్ గా ఉంటుంది. అన్ని విషయాల్లో స్పెషల్ కేర్ తీసుకున్నాం. హాలీవుడ్ మూవీలా ఉంటుంది’ అని వెంకట్ ప్రభు చెప్పుకొచ్చాడు. ‘ది గోట్’లో విజయ్ కోసం స్పెషల్ గా ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’ వాడారు. ఈ టెక్నాలజీతో ఆయనను యంగ్ ఏజ్ లుక్ తో చూపించనున్నారు. ‘ది గోట్’లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా లీడ్ రోల్స్ చేశారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com