Venu Yeldandi : వేణు ‘ఎల్లమ్మ’ కోసం సైరాట్ ద్వయం

కమెడియన్ నుంచి దర్శకుడై ఓవర్ నైట్ టాలీవుడ్ మొత్తాన్ని ఫిదా చేశాడు వేణు ఎల్దండి. అతను డైరెక్ట్ చేసిన బలగం చూసి ఏడ్వని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించాడు. తన నేటివిటీని వెండితెరపై చూపిస్తూ ఆంధ్ర ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. అందుకే డైరెక్టర్ గా అతని నెక్ట్స్ మూవీ ఏంటా అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్ల క్రితం నాని తో ఎల్లమ్మ అనే సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. బట్ నాని కమిట్మెంట్స్ వేరే ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ లోకి నితిన్ వచ్చాడు.
దిల్ రాజే నిర్మించబోతోన్న ఈ చిత్రం కోసం క్రేజీ టెక్నీషియన్స్ ను తీసుకున్నాడు వేణు. మరాఠీలో అద్భుతమైన మ్యూజిక్ తో ఆకట్టుకుంటూ అప్పుడప్పుడూ బాలీవుడ్ నూ షేక్ చేసే మ్యూజికల్ డ్యూయో.. అజయ్ - అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారని గతంలోనే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరితో కలిసి ముంబైలో మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నాడు వేణు. ఈ ఇద్దరూ మ్యూజిక్ అందించిన సైరాట్ లోని పాటలు దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపాయి. సైరాట్ మరాఠీ నుంచి తొలి 100 కోట్ల సినిమాగా రికార్డ్ సృష్టిస్తే.. ఆ రికార్డ్ లో మేజర్ షేర్ వీరిదే అంటే అతిశయోక్తి లేదు.
ఇక ఈ చిత్రాన్ని కూడా తెలంగాణ నేపథ్యంలోనే రూపొందించబోతున్నాడు వేణు. ఈ సారి బ్యాక్ డ్రాప్ చాలా పెద్దగా ఉంటుందట. బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని.. బిగ్ స్పాన్ మూవీ అవుతుందని టాక్. ఓ రకంగా కాంతార అంత ఇంపాక్ట్ ఈ కథలో ఉందనే గాసిప్స్ కూడా ఉన్నాయి. వచ్చే నెల నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోందంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com