హీరోయిన్ల అందాలనూ నమ్ముకున్న దర్శకులు

హీరోయిన్ల అందాలనూ నమ్ముకున్న దర్శకులు

ఒకప్పుడు స్కిన్ అంటే అందుకోసం ప్రత్యేకంగా వ్యాంప్ క్యారెక్టర్స్ ఉండేవి. వాళ్లు కూడా పరిమితంగానే ఉండేవారు. తర్వాత ఆ ప్లేస్ ను హీరోయిన్లే తీసుకున్నారు. ఒక కాలంలో హీరోయిన్ అంటే కేవలం పాటలు, రొమాన్స్ కే పరిమితం అయింది. ఈ మధ్య కాలంలో వారికీ బలమైన పాత్రలు పడుతున్నాయి. టాలెంట్ ఉన్నవాళ్లు ప్రూవ్ చేసుకుంటున్నారు. లేనివాళ్లు తేలిపోతున్నారు. అయితే ఈ ఆగస్ట్ 15న వస్తోన్న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ మూవీస్ లోని హీరోయిన్లను చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆ దర్శకులు కావాలనే వారితో విపరీతమైన ఎక్స్ పోజింగ్ చేయించుకున్నారు అనేది తేలిపోతుంది. ఆ పాత్రలకు ఎంత వరకు అవసరం అనేది పక్కన బెడితే మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తే నాలుగు టికెట్స్ ఎక్కువ తెగుతాయి అనే కక్కుర్తి మాత్రం సదరు దర్శకుల నుంచి కనిపిస్తోంది.

మిస్టర్ బచ్చన్ తో భాగ్యశ్రీ బోర్సే తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఫస్ట్ మూవీతోనే అమ్మడు టాలెంట్ అంతా చూపించేస్తోంది. అయితే ఇది నటనలో కాదు.. ఎక్స్ పోజింగ్ లో. ఇక రవితేజ అయితే తన ఏజ్ ను మర్చిపోయి మరీ ఆ పిల్లతో చేసిన రొమాన్స్, అవసరం ఉందా లేదా అనేది పక్కనబెడితే ఆ పిల్లను అదే పనిగా తడిమేయడం చూస్తే ఈ దర్శకుడి ఆలోచనే కాదు.. హీరో తీరు కూడా అర్థం అవుతుంది. ఓ రకంగా మిస్టర్ బచ్చన్ టీజర్ పెద్దగా ఆకట్టుకోలేదు. అంతకు మించి ఇప్పటి వరకూ వచ్చిన ఈమూవీ సాంగ్స్ లోని హీరోయిన్ అందాలే ఎక్కువ హైలెట్ అవుతున్నాయి.. అంటే దర్శకుడు 'టార్గెట్ రీచ్' అయినట్టే.

ఇక మొదట్నుంచీ హీరోయిన్లను థర్డ్ గ్రేడ్ లో చూపించడంలో ఎక్స్ పర్ట్ అయిన పూరీ జగన్నాథ్ ఈ సారి మరింత డోస్ పెంచాడు. తప్పదు మరి ఇప్పుడు అతని పరిస్థితి అలా ఉంది. ఖచ్చితంగా హిట్ కొట్టాలి. అందుకోసం మరికొన్ని మెట్లు దిగాడని డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ లోనూ హీరో, హీరోయిన్ మధ్య అతని డైలాగ్స్ చీప్ గా కనిపించాయి. అప్పుడే చీపు.. ఇప్పుడు హిట్ కొట్టాలి కాబట్టి ఈ సారి చీపెస్ట్ అనేద్దా అనుకున్నాడేమో.. ఏకంగా సదరు హీరోయిన్ కావ్య థాపర్ తో హాలీవుడ్ రేంజ్ కట్స్ చేయించాడు. ట్రైలర్ ఊరమాస్ గా ఉన్నా.. చాలామంది పూరీ హీరోయిన్ తో చేయించిన స్కిన్ షో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. సో.. ఇక్కడా పూరీ కూడా 'టార్గెట్ రీచ్" అవుతున్నట్టే..

ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇలాంటి వాటి గురించి వాళ్లతో ఎవరైనా మాట్లాడితే.. ''మేం చాలా నిజాయితీ పరులం. మా మనసులో ఎలాంటి చెడూ లేదు.. మీరే తప్పుగా చూస్తున్నారు.. " అంటూ వితండ వాదం చేయగలరు. చేస్తున్నారు కూడా. అదీ మేటర్. ఈ ఇద్దరూ తమ సినిమాల కంటెంట్స్ తో పాటు.. అదే స్థాయిలో హీరోయిన్ల స్కిన్ షోస్ ను కూడా బలంగా నమ్ముకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు చాలామంది. మరి వీరు టార్గెట్స్ రీచ్ అవుతారా లేదా అనేది చూడాలి.

Tags

Next Story