Samantha : సమంతను వదలని దర్శకులు

Samantha : సమంతను వదలని దర్శకులు
X

టాలెంటెడ్ బ్యూటీ సమంత మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేస్తోంది. అయితే ఈ సారి రెగ్యులర్ గా కాకుండా తను ఎక్కడైతే ముగించిందో అక్కడి నుంచే ఫెరోషియస్ గా మొదలుపెట్టబోతోంది. యస్.. తను గతంలో చేసిన ద ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో తన పాత్ర, నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలాగే యాక్షన్, స్టంట్స్ విషయంలోనూ అదరగొట్టింది. అలాంటి సిరీస్ లో తనకు ఆఫర్ ఇచ్చిన దర్శక ద్వయం రాజ్ - డికే మరోసారి ఆమెతో మరో గొప్ప పాత్ర చేయించబోతున్నారు. అయితే ఈ సారి వీళ్లు డైరెక్షన్ చేయడం లేదు. నిర్మాతలుగా మాత్రమే వ్యవహరించబోతున్నారు. రక్త్ భ్రమంద్ అనే టైటిల్ తో రూపొందబోతోన్న ఈ సిరీస్ ను తుంబాద్ డైరెక్టర్ చేతిలో పెట్టారు.

తుంబాద్ తో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన అప్లాజ్ అందుకున్న దర్శకుడు రాహి అనిల్ బార్వే. ఈ రక్త్ భ్రమంద్ ను అతనే డైరెక్ట్ చేయబోతున్నాడు. టైటిల్ కు తగ్గట్టుగానే మూవీ అంతా బ్లడ్ షెడ్ తో నిండి ఉంటుందట. అలాగే అనేక వాస్తవ సంఘటనలు కూడా ఈ కథలో మిక్స్ అయి ఉంటాయని సమాచారం. సమంత ప్రధానంగా ఉన్నా సిద్ధార్థ్ రాయ్ కపూర్, వామికా గబ్బి కీలక పాత్రలు చేయబోతున్నారు.

విశేషం ఏంటంటే.. ఈ దర్శక ద్వయం సమంతను వదలడం లేదు. ద ఫ్యామిలీ మేన్ 2 తర్వాత ఆమెతోనే సిటాడెల్ వెబ్ సిరీస్ రూపొందించారు. త్వరలోనే అది విడుదల కాబోతోంది. ఇప్పుడు ఈ రక్త్ భ్రమంద్. దర్శకుల ఆలోచనలకు తగ్గట్టుగా నటించే ఆర్టిస్టులను ఎవరూ వదులుకోరు అనేందుకు శామ్ మరో ఎగ్జాంపుల్. ఎంతైనా శామ్ ఎంత టాలెంటెడ్ అనేది ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసి ఉన్నాం కదా.. మరి ఈ సిరీస్ తో తను ఇంకెంత గొప్పగా కనిపించబోతోందో చూడాలి.

Tags

Next Story