Disha Patani : అప్పుడు రిజెక్ట్.. ఇప్పుడు ఫిక్స్..!

Disha Patani : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకి ఊహించిని దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అక్కడ రూ. 100 కోట్లు కొల్లగొట్టి తెలుగు సినిమా స్థాయిని పెంచింది ఈ చిత్రం.. ఇక ఈ సినిమాలోని హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
మత్తు వాయిస్‌తో ఉ అంటావా మావా ఊ ఊ అంటావా సాగే ఈ పాటకి వీపరితమైన రెస్పాన్స్ వచ్చింది. చంద్రబోస్ ఈ పాటకి లిరిక్స్ అందించగా.. ఇంద్రావతి చౌహాన్ ఈ పాటను ఆలపించారు. దేవి మ్యూజిక్ అందించాడు. అయితే ముందుగా ఈ పాట కోసం బాలీవుడ్ బ్యూటీ దిశాపాటానీ అనుకున్నారు మేకర్స్.. కానీ దీనిని చేసేందుకు ఆమె నిరాకరించడంతో సామ్‌ని తీసుకున్నారు మేకర్స్. ఆ పాట సమంతకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది.
ఇక ఇదిలా ఉంటే పుష్ప సెకండ్ పార్టులో కూడా ఓ ఐటెం సాంగ్ ఉండబోతుందట. అయితే ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి మేకర్స్ దిశాపటానిని సంప్రదించారని తెలుస్తోంది.. ఊ అంటావా పాటకు వచ్చిన క్రేజ్ చూసిన పటాని పార్ట్-2లో స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టీ మీడియా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. సెకండ్ పార్ట్ పైన భారీ అంచనాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com