Disha Patani: అక్క ఆర్మీ ఆఫీసర్.. చెల్లెలు సినీ స్టార్..!

Disha Patani: అందమైన ఆ అక్క చెల్లెళ్లిద్దరూ తమ కెరీర్‌ని భిన్నంగా ఎంచుకున్నారు. ఒకరు దేశం కోసం ఆర్మీ ఆఫీసర్ అయితే, మరొకరు వెండి తెరపై వెలిగిపోతున్నారు. బాలీవుడ్ తార దిశాపటాని తెలిసినంతగా ఆమె సోదరి ఖుష్బూ పటాని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా పని చేస్తుంది. ముగ్గురు పటానీ తోబుట్టువులలో ఖుష్బూ పెద్దది - సోదరుడు సూర్యాంశ్ పటానీ చిన్నవాడు.
ఖుష్బూ ఆర్మీలో శిక్షణ పొది లెఫ్టినెంట్‌గా భారతదేశానికి సేవలు అందిస్తోంది. తండ్రి, జగదీష్ సింగ్ పోలీసు అధికారి, తల్లి హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోంది. దిశ, ఖుష్బూల సోదరుడు సూర్యాంశ్ ఏ మార్గాన్ని అనుసరించాలో నిర్ణయించుకోకపోయినా, దిశా మాత్రమే ఆమె కుటుంబంలోని మిగిలిన వారి కంటే భిన్నమైన కెరీర్‌ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. దిశ అనేక చిత్రాలలో నటించింది. పాన్ ఇండియా మూవీ రాథే శ్యామ్, యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ చిత్రాల్లో నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com