Allu Arjun Pushpa 2 : పుష్ప 2 పై డివైడ్ టాక్

Allu Arjun  Pushpa 2 :  పుష్ప 2 పై డివైడ్ టాక్
X

అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ఇప్పటి వరకూ ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో మూవీ టీమ్ సక్సెస్ అయింది. పట్నాలో నిర్వహించిన ట్రైలర్ లాంచింగ్ కు వచ్చిన జనాన్ని చూసి దేశమే నివ్వెరపోయింది. తమిళ నాడులో సైతం భారీగానే వచ్చారు. తెలుగులో ఎలాగూ క్రేజ్ ఉంది. అటు కేరళ నుంచి పుష్ప 2 టీమ్ కు భారీ స్వాగతం లభించింది. అంతా ఓకే అనుకుంటోన్న వేళ అనూహ్యంగా పుష్ప 2 కు డివైడ్ టాక్ స్టార్ట్ అయింది. అది కూడా నిర్మాతల స్టేట్మెంట్ వల్లే కావడం విశేషం.

ప్రస్తుతం ఓటిటిలు వచ్చిన తర్వాత ఆడియన్స్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో పాటు పర్ఫెక్ట్ రన్ టైమ్ కు అలవాటు పడ్డారు. నిడివి ఎక్కువైతే అదే సినిమాకు పెద్ద మైనస్ అవుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఏవో కొన్ని తప్ప మిగతావన్నీ రన్ టైమ్ వల్ల లాస్ అయినవే. ఇలాంటి వేళ పుష్ప లాంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమా రన్ టైమ్ ఏకంగా 3.30 గంటలు అని చెప్పడంతో అంత సేపు ఎవరు చూస్తారు బాబూ అంటూ నెగెటివ్ కమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. సినిమా ఎంత బ్రిలియంట్ గా ఉన్నా.. కొత్త జానర్ అయితేనో.. అస్సలు ఎక్స్ పెక్ట్ చేయని స్క్రీన్ ప్లే ఉంటేనో తప్ప మూడు గంటలు కూడా భరించలేకపోతున్నారు ప్రేక్షకులు. ఈ టైమ్ లో అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం వచ్చిన లవకుశ, దానవీరశూరకర్ణ టైప్ లో మూడున్నర గంటల సినిమా అంటే ఎంత బావున్నా భరించడం కష్టం అంటున్నారు. పైగా మ్యూజిక్ విషయంలో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఏ మాత్రం తేడా కొట్టినా మొత్తానికే మోసం వస్తుంది. అది పూర్తిగా నిర్మాతలకే లాస్ అవుతుంది.

కేవలం నిడివి మూడున్నర గంటలు అన్న దగ్గర నుంచే పుష్ప 2పై డివైడ్ టాక్ మొదలైంది. ఇది సినిమా ఓపెనింగ్ పై ప్రభావం చూపించకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఫుల్ రన్ పై ప్రభావం చూపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ఎంత బావున్నా.. ఇదుగో ఈ సీన్స్ లేకున్నా ఫర్వాలేదు అనే టాక్ వస్తే ఖచ్చితంగా సినిమాకు మైనస్ అవుతుంది. మరి ఇవన్నీ చూసుకునే ఉంటారు మేకర్స్. అయినా మేకర్స్ ఆలోచనతో ఆడియన్స్ ఏకీభవించాలనేం లేదు కదా. ప్రస్తుతానికైతే ఈ డివైడ్ టాక్ తో కూడా పుష్ప జనాల్లో ఉందనే చెప్పాలి.

Tags

Next Story