Samantha: మెగా కాంపౌండ్‌లో దీపావళి సంబరాలు.. స్పెషల్ గెస్ట్‌గా సమంత..

Samantha: మిగతా రోజుల్లో ఎవరెక్కడ ఉన్నా పండుగ రోజు కుటుంబసభ్యులంతా ఒక చోట కలుసుకుంటే ఆ ఆనందమే వేరు. అసలైన పండగ అప్పుడే వస్తుంది. మెగా స్టార్ ఇంట్లో దీపావళి పండగ రోజు మెగా ఫ్యామిలీ అంతా కలుసుకున్నారు.

యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని వచ్చిన సాయిధరమ్ తేజ్‌తో పాటు పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్, నిహారిక చైతన్య దంపతులు, ఇంకా స్పెషల్ గెస్ట్‌లు సమంత, ఆమె స్నేహితురాలు శిల్పా రెడ్డి కూడా మెగా వారి ఇంట సందడి చేశారు. దీపావళి సంబరాల్లో పాలు పంచుకున్నారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసనతో కలిసి సరదాగా గడిపారు.
దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. వేడుకల్లో పాలు పంచుకున్న అకీరా నందన్ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, అల్లు అర్జున్‌తో కలిసి అకీరా ఫోటోలు దిగారు. సమంత, ఉపాసన, రామ్ చరణ్ కలిసి దిగిన ఫోటలో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com