Suriya vs Karthi : కోలీవుడ్ లో దీపావళి రష్

Suriya vs Karthi :  కోలీవుడ్ లో దీపావళి రష్
X

తెలుగు వారికి దసరా సీజన్ ఎలాగో తమిళ్ వారికి దీపావళి అలా. వాళ్ల సినిమాలు ఎక్కువగా దీపావళికి విడుదలవుతుంటాయి. కొన్నాళ్లుగా మనవాళ్లు కూడా ఈ సీజన్ ను బాగా వాడుకుంటున్నారు. 2024 దీపావళికి వచ్చిన మూడు తెలుగు సినిమాలూ సూపర్ హిట్ అనిపించుకున్నాయి. ఈ సారి తెలుగు నుంచి దీపావళి రిలీజ్ పోస్టర్స్ ఇంకా పడలేదు కానీ.. తమిళ్ నుంచి మాత్రం గట్టి పోటీ కనిపిస్తోంది. ఇందులో సూర్య, కార్తీ మధ్య కూడా పోటీ తప్పేలా లేదు అంటున్నారు. ఇప్పటికైతే దీవాళికి కోలీవుడ్ నుంచి ప్లాన్ లో ఉన్న మూవీస్ ఏకంగా ఐదు ఉన్నాయి.

సూర్య, త్రిష జంటగా ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తోన్న చిత్రాన్ని దీపావళికే విడుదల చేయబోతున్నారనే టాక్ కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. ఆ డేట్ కు ఆల్రెడీ కార్తీ డ్యూయొల్ రోల్ చేస్తోన్న సర్దార్ 2 షెడ్యూల్ అయి ఉంది. అంటే సూర్య మూవీ కూడా వస్తే అన్నదమ్ముల మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదేమో.

ఇక లేటెస్ట్ కోలీవుడ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఏకంగా రెండు సినిమాలతో దీపావళిని టార్గెట్ చేసుకున్నాడు. వీటిలో ఏదో ఒకటి ముందు లేదా వెనక్కి వెళుతుంది. బట్ ఒకటైతే ఖచ్చితంగా వస్తుంది.

ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని దీవాళికి విడుదల చేస్తారన్నారు. అలాగే ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటిస్తోన్న చిత్రానికి ‘డూడ్’అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ డూడ్ కూడా దీపావళికే రావాలనుకుంటున్నాడు.

వీరితో పాటు హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న ‘బైసన్’అనే చిత్రాన్ని దీపావళికే విడుదల చేయబోతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతోన్న మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది.

మొత్తంగా సూర్య, కార్తీల్లో ఎవరో ఒకరు తగ్గే అవకాశం ఉంది. అలాగే ప్రదీప్ మూవీస్ లో ఒక్కటే షెడ్యూల్ అవుతుంది. అలా చూసుకున్నా.. ఇప్పటికే మూడు సినిమాలు కర్చీఫ్ లు వేశాయి. ఇంకెవరైనా పెద్ద స్టార్ కూడా రంగంలోకి దిగితే వీరిలోనూ మార్పుల చేర్పులు ఉంటాయి. సో.. కోలీవుడ్ లో పెద్ద సీజన్ గా చూసే దీపావళికి ఇప్పటి నుంచే గట్టి పోటీ అయితే ఉంది.

Tags

Next Story