Neha Shetty Remuneration: 'డీజే టిల్లు' భామ జోరు.. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటూ..

Neha Shetty (tv5news.in)
Neha Shetty Remuneration: మామూలుగా రెండు, మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యేవరకు రెమ్యునరేషన్‌ను పెంచే ధైర్యం చేసేవారు కాదు నటీనటులు. కానీ.. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయ్యి.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే చాలు.. వెంటనే రెమ్యునరేషన్‌ను ఆకాశానికి పెంచేస్తున్నారు నటీనటులు. అందులోనూ ముఖ్యంగా హీరోయిన్లే ముందుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి 'డీజే టిల్లు' భామ నేహా శెట్టి కూడా చేరింది.

మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది నేహా శెట్టి. ఆ సమయంలో తనకు ఓ కన్నడ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వెంటనే మోడల్ నుండి హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మెహబూబా'లో ఆకాశ్ పూరీతో కలిసి నటించింది. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేకపోయింది. అందుకే నేహాకు తెలుగులో మరో అవకాశం రావడానికి మూడు సంవత్సరాలు పట్టింది.

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన 'గల్లీ రౌడీ' కూడా నేహాకు ఊహించినంత స్టార్‌డమ్‌ను తీసుకొని రాలేకపోయింది. కానీ ఇటీవల సిధ్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన 'డీజే టిల్లు'.. నేహాను అమాంతం స్టార్‌ను చేసేసింది. సినిమాలో గ్లామర్ విషయంలో కానీ, యాక్టింగ్ విషయంలో కానీ నేహా శెట్టి ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతల చూపు నేహాపై పడింది.

సినీరంగంలో హీరోయిన్లకు చాలా తక్కువ లైఫ్ ఉంటుంది. అందుకే స్టార్‌డమ్ రాగానే రెమ్యునరేషన్‌ను పెంచేసే పనిలో ఉంటారు భామలు. నేహా శెట్టి కూడా ప్రస్తుతం అదే పనిలో ఉందట. నేహా ఇప్పటివరకు ఒక అప్‌కమింగ్ హీరోయిన్‌లాగానే రెమ్యునరేషన్ తీసుకున్నా కూడా డీజే టిల్లు సక్సెస్‌తో తాను ఏకంగా రూ. 50 లక్షల పారితోషికం డిమాండ్ చేస్తోందట. తన డిమాండ్‌కు కొందరు నిర్మాతలు కూడా ఓకే అన్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com