Raviteja : మిస్టర్ బచ్చన్ తో డిజే టిల్లు లొల్లి

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన మూవీ ‘మిస్టర్ బచ్చన్ ’. ఈ మూవీ ఈ నెల 15న విడుదల కాబోతోంది. భాగ్యశ్రీ బోర్సే బచ్చన్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. బాలీవుడ్ రైడ్ మూవీకి రీమేక్ గా వస్తోన్న మిస్టర్ బచ్చన్ ను తెలుగు వెర్షన్ లో చాలా మార్పులు చేశాడు హరీశ్ శంకర్. ఒరిజినల్ కు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన టీజర్ చూస్తే ఇవన్నీ అర్థం అవుతాయి. ఇప్పటి వరకూ వచ్చిన పాటలు కూడా జస్ట్ ఓకే అనిపించుకున్నాయి. ఇక డ్యాన్స్ లైతే పూర్తి సెడక్టివ్ గా కనిపిస్తుండటం ఆశ్చర్యం. తనలో సగం కంటే తక్కువ వయసున్న హీరోయిన్ తో రవితేజ చేస్తోన్న విన్యాసాలు టాలీవుడ్ నూ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇక లేటెస్ట్ గా మరో కొత్త న్యూస్ ఏంటంటే.. మిస్టర్ బచ్చన్ లో మిస్టర్ టిల్లు కూడా ఉన్నాడట. డిజే టిల్లుతో ప్రతి తెలుగు వారికీ హండ్రెడ్ పర్సెంట్ పరిచయం అయిన సిద్ధు జొన్నలగడ్డ ఈ మూవీలో చిన్న పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన పోర్షన్ షూటింగ్ చేస్తున్నారట. విశేషం ఏంటంటే.. ఈ మూవీలో రవితేజ, సిద్దు మధ్యలో ఒక ఫైట్ కూడా ఉంటుందట. ఆ ఫైట్ నే ఇప్పుడు షూట్ చేస్తున్నారు. మరి ఫైట్ వరకూ ఉందంటే సిద్ధు చేసేది జస్ట్ కేమియో రోల్ అయితే కాదు. ఏదైనా కీలకమైన పాత్రే అయి ఉండాలి. మరి ఆ పాత్ర నిడివి ఎంత సేపు ఉంటుందో కానీ.. వీరి కాంబినేషన్ కు థియేటర్స్ లో విజిల్స్ పడటం ఖాయం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com