Film Actress Kasturi : డీఎంకే పార్టీ నా కామెంట్స్ ను వక్రీకరిస్తోంది : కస్తూరి

సినీ నటి కస్తూరి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆమె బ్రాహ్మణ సమ్మేళనంలో మాట్లాడుతూ.. ' 300 ఏళ్ల క్రితం అంతఃపురంలో మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు' అంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు అటు తమిళనాట, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. కస్తూరి తెలుగు వారిని అవమానిస్తున్నారంటూ నెటిజెన్లు మండిపడుతున్నారు. తాను అలా అనలేదని, వాటిని వక్రీకరించారని ఆమె వివరణ ఇవ్వడం గమనార్హం. 'తెలుగు నా మెట్టినిల్లు. తెలుగు వారంతా నా కుటుంబం. ఇది తెలియనివారు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. తెలుగు వారు ఎంతోమంది నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు.తమిళ మీడియాలో నా కామెంట్స్ను వక్రీకరిస్తూ వస్తున్న వార్తలను తెలుగు ప్రజలు నమ్మొద్దని కోరుతున్నా. డీఎంకే పార్టీ నా కామెంట్స్ ను వక్రీకరిస్తోంది. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com