Mohanlal : హీరోల మతాల వల్ల రెండు క్లైమాక్స్ లున్న సినిమా ఏంటో తెలుసా..?

ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ ఉంటే ఆ హీరోయిన్ ఎవరికి దక్కుతుంది అనేది ఒకప్పుడు పెద్ద డిబేట్ గా ఉండేది. ఇక ఆ ఇద్దరూ టాప్ హీరోలైతే ఫ్యాన్స్ నుంచి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కథ ఏదైనా ఆ హీరోయిన్ ను మా వాడే చేసుకోవాలి అనే డిమాండ్ ఉండేది. దీంతో పాటు కేవలం హీరోల మతాల కారణంగా రెండు క్లైమాక్స్ లు చిత్రీకరించి.. రెండు ప్రాంతాల్లో వేర్వేరు క్లైమాక్స్ లతో రిలీజ్ చేసిన సినిమా ఎప్పుడైనా చూశారా..? కనీసం విన్నారా.. ? అసలు ఇలా జరిగే అవకాశం ఉందీ అనుకుంటున్నారా..? యస్ ఉంది. అది మళయాలంలో జరిగింది.
1998 సెప్టెంబర్ 4న విడుదలైన హరికృష్ణన్స్ అనే మూవీతో ఈ అరుదైన క్లైమాక్స్ ఘటన జరిగింది. ఫాజిల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జుహీ చావ్లా హీరోయిన్ గా నటించింది. హరికృష్ణన్స్ అనే పేరుతోనే ఉన్న ఇద్దరు లాయర్స్ కలిసి కేస్ లు వాదిస్తుంటారు. వారి వద్దకు ఒక మర్డర్ కేస్ వస్తుంది. ఆ కేస్ సందర్భంగా ఇద్దరూ హీరోయిన్ ను కలిసి ప్రేమిస్తారు. ఆమె కూడా ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తుంది. మరి చివర్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఆమె టాస్ వేస్తుంది. అయితే ఎవరి పేరు వచ్చినా మరో హీరో అభిమానులు అల్లరి చేస్తారని భావించిన ఫాజిల్.. ముస్లీం కమ్యూనిటీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మమ్మూట్టిని పెళ్లి చేసుకున్నట్టుగా, హిందూ కమ్యూనిటీస్ ఎక్కువగా ఉండే ప్రాంతా్లో మోహన్ లాల్ ను పెళ్లి చేసుకున్నట్టుగా రెండు క్లైమాక్స్ లు చిత్రీకరించి అలాగే ఆయా ప్రాంతాల్లో విడుదల చేశారు. దర్శకుడి ప్లాన్ బ్రహ్మాండంగా వర్కవుట్ అయింది. సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
అయితే సెన్సార్ బోర్డ్ కు వీళ్లు మోహన్ లాలన్ వెర్షన్ ను మాత్రమే చూపించారట. కానీ ఇలా రెండు క్లైమాక్స్ లతో రిలీజ్ చేయడంతో వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లీగల్ గా ప్రొసీడ్ అవుతామని హెచ్చరించింది. బట్ వీళ్లు చెప్పుకునేదేదో చెప్పుకున్నారు. ఏమైతేనేం.. కమ్యూనిటీస్ కోసం రెండు క్లైమాక్స్ లతో విడుదలైన ఏకైక ఇండియన్ సినిమాగా హరికృష్ణన్స్ రికార్డ్ క్రియేట్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com