Balayya Special Records : బాలయ్య కెరీర్ లో ఈ స్పెషల్ రికార్డ్ గురించి తెలుసా..

Balayya Special Records : బాలయ్య కెరీర్ లో ఈ స్పెషల్ రికార్డ్ గురించి తెలుసా..

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడుగా దూసుకుపోతున్నాడు. అయితే నైన్టీస్ లో ఆయన జోరు వేరేగా ఉండేది. మాస్ తో పాటు క్లాస్ ను కూడా అలరిస్తూ.. అప్పుడప్పుడు మైథాలజీ, సోషియో ఫాంటసీ, ఫోక్లోర్ అంటూ వైవిధ్యమైన సినిమాలతోనూ అదరగొట్టాడు. అయితే బాలయ్య కెరీర్ లో ఒక అరుదైన రికార్డ్ ఉంది. ఒక టాప్ స్టార్ ఆయన నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఆ సినిమాలు నిప్పురవ్వ, బంగారు బుల్లోడు. ఈ రెండు సినిమాల్లోనూ అనేక ప్రత్యేకతలు ఉండటం విశేషం.

ముందుగా నిప్పురవ్వ స్టార్ట్ అయింది. ఏ కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగుతుంది. అయితే షూటింగ్ టైమ్ లో ఒక ప్రమాదం జరిగింది. దీంతో సినిమాను రిలీజ్ చేయొద్దని కొందరు కోర్ట్ కు వెళ్లారు. బట్ అప్పటికే షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. చివరికి రిలీజ్ కు పర్మిషన్ వచ్చింది. 1993 సెప్టెంబర్ 3న విడుదలై యావరేజ్ మూవీగా నిలిచింది. ఇక టాలీవుడ్ లో సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న బాలయ్య - విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా ఇదే కావడం విశేషం. అలాగేఈ మూవీకి బప్పీ లాహిరి పాటలు ఇస్తే.. ఒక్క పాటను రాజ్ కోటి అందించగా నేపథ్య సంగీతం ఏఆర్ రెహ్మాన్ అందించాడు. ఒకే సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం కూడా అప్పట్లో ప్రత్యేకంగా చెప్పుకున్నారు.

ఇక నిప్పురవ్వ విడుదలైన రోజునే బాలయ్య మరో మూవీ బంగారు బుల్లోడు విడుదలైంది. రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాజ్ కోటి సంగీతం అప్పట్లో ఓ సెన్సేషన్. ఇప్పటిక ఈ మూవీ పాటలు ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఇక కెరీర్ లో 90 శాతం రీమేక్ మూవీస్ నే చేసిన రవిరాజా పినిశెట్టి ఈ మూవీని డైరెక్ట్ గానే తీశారు. పద్మకుమార్ అందించిన కథకు సత్యమూర్తి స్క్రీన్ ప్లే అందించారు. రవిరాజా తనదైన శైలిలో మ్యాజిక్ చేశారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన రమ్మకృష్ణ, రవీనా టాండన్ లు ఫస్ట్ టైమ్ బాలయ్యతో జోడీ కట్టారు.

సో.. ఇలా బాలయ్య లాంటి టాప్ హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం ఓ అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. నిప్పురవ్వ ఆల్మోస్ట్ ఫ్లాప్ అయినా.. బంగారు బుల్లోడు బ్లాక్ బస్టర్ గా నిలిచి రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ లో బాలయ్య స్టామినాను మరోసార బాక్సాఫీస్ కు చూపించింది.

Tags

Next Story