Meenakshi Chowdhary : ఏంటి.. మీనాక్షిలో ఈ టాలెంట్స్ కూడా ఉన్నాయా

Meenakshi Chowdhary :  ఏంటి.. మీనాక్షిలో ఈ టాలెంట్స్ కూడా ఉన్నాయా
X

తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతోన్న బ్యూటీ మీనాక్షి చౌదరి. తెలుగులో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో పరిచయం అయింది. ఆ వెంటనే రవితేజ సరసన ఖిలాడీ మూవీలో ఆఫర్ కొట్టేసింది. ఈ రెండు సినిమాలు పోయినా.. అమ్మడిలోని స్పార్క్ ను టాలీవుడ్ పట్టేసింది. ఆ మాటకొస్తే కోలీవుడ్ కూడా పట్టేసింది. అందుకే అక్కడ వెంటనే కోలై అనే మూవీలో ఆఫర్ అందుకుంది. విజయ్ ఆంటోనీ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో హత్య పేరుతో డబ్ చేశారు కూడా. ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల కొరత ఉంది. ఆ లోటును పూడుస్తూ మీనాక్షి టాప్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. బట్ తను నటించిన చిత్రాల్లో హిట్ 2 తప్ప ఏదీ హిట్ కాలేదు. గుంటూరు కారంపై బోలెడు ఆశలు పెట్టుకున్నా.. ఆ సినిమా రిజల్ట్ కంటే ఆమె పాత్రే ఎక్కువగా డిజప్పాయింట్ చేసింది. మరోవైపు తమిళ్ లో చేసిన సింగపూర్ సెలూన్, గోట్ చిత్రాలు కూడా పోయాయి. అయినా మీనాక్షిపై కమెంట్స్ రాలేదు. అందుకు కారణం తన టాలెంట్ పై ఆడియన్స్ కు, మేకర్స్ కూ నమ్మకముంది. పైగా ఆల్రెడీ తను కమిట్ అయిన సినిమాలు వరుసగా రాబోతున్నాయి. ఇందులో లక్కీ భాస్కర్ ఈ నెల 31న విడుదల కాబోతోంది. లక్కీ భాస్కర్ లో తన పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.

తర్వాత మెకానిక్ రాకీ, మట్కా, విశ్వంభర చిత్రాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మీనాక్షి చౌదరి గురించి చాలామందికి తెలియని విషయాలు వేరే ఉన్నాయి. ఆమె డాక్టర్ అనేది కొందరికి తెలుసు. ఇవి కాక తను సినిమాల్లోకి, మోడలింగ్ లోకి రాకముందే.. నేషనల్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, నేషనల్ లెవల్ స్విమ్మర్, మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ 2018 గా నిలిచింది. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా 'మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆఫ్ ఇండియా' కాంటెస్ట్ లో 50 మందిలో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అలాగే అత్యంత కఠోరమైన మిలిటరీ శిక్షణ కూడా తీసుకుని ఇండియన్ మిలిటరీ అకాడెమీ నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఇన్ని బెస్ట్ క్వాలిఫికేషన్స్ తోనే మోడలింగ్ లోనూ రాణించి అలా సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయింది.

ఈ మధ్య కాలంలో ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఏకైక బ్యూటీ తనే అంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి. ఇప్పటి వరకూ మీనాక్షికి అదే కాస్త తగ్గింది. లక్కీ భాస్కర్ తో హిట్స్ కూడా స్టార్ట్ అవుతాయేమో చూడాలి.

Tags

Next Story