Sri Leela : పుష్ప 2 ఐటమ్ సాంగ్ .. శ్రీ లీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Sri Leela :  పుష్ప 2 ఐటమ్ సాంగ్ .. శ్రీ లీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
X
Do you know Sri Leela Remuneration for Pushpa 2 item song.?

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ పుష్ప 2. ఫస్ట్ పార్ట్ పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కాకపోతే అల్లు అర్జున్ సినిమా అనే క్రేజ్ మాత్రం ఆ టైమ్ లో కనిపించింది. పుష్ప తెలుగులో అబౌ యావరేజ్ అనిపించుకున్నా.. నార్త్ లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ మూవీ మేనరిజంస్, పాటలు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాయి. దీంతో ఊహించని రేంజ్ లో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ సారి మరింత జాగ్రత్తగా పుష్ప 2తో వస్తున్నాడు. దాదాపు మూడేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీకి ముందు నుంచీ అందరికీ సవాల్ గా నిలిచిన విషయం ఐటమ్ సాంగ్. ఇంకా చెబితే ఐటమ్ సాంగ్ లో నర్తించే బ్యూటీ ఎవరా అనే క్వశ్చన్ అందర్లోనూ ఉంది.

పుష్ప 2 ఐటమ్ సాంగ్ కోసం చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఎవరూ ఫైనల్ కాలేదు. చివరగా బాలీవుడ్ బ్యూటీ స్త్రీ 2 మూవీతో ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టిన శ్రద్ధా కపూర్ ఫైనల్ అనేశారు. బట్ తను 8 కోట్ల రెమ్యూనరేషన్ అడిగిందట. వీళ్లు 3 కోట్ల వరకూ ఓకే అన్నారట. అయినా నో చెప్పింది శ్రద్ధా. దీంతో తెలుగులోనే డ్యాన్స్ లతో దుమ్మురేపుతున్న శ్రీ లీలను తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఐటమ్ సాంగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. మరి ఈ సాంగ్ కోసం శ్రీ లీలకు ఇస్తోన్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..

1.5 కోట్లు. యస్.. అక్షరాలా కోటిన్నర రూపాయలు ఈ పాటకు పారితోషికంగా తీసుకుంటోంది శ్రీ లీల. శ్రీ లీలతో అల్లు అర్జున్ డ్యాన్సులు అనేది చూడ్డానికి కన్నుల పండగలా ఉంటుంది. ఐకన్ స్టార్ అంటే డ్యాన్స్ ల్లో తోపు. ఈ పిల్ల ప్రస్తుతం ఏ హీరోతో చేసినా ఆ హీరోలకు డ్యాన్సుల్లో చెమటలు పుట్టిస్తోంది.అందుకే ఈ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనుకోవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం చేతిలో సినిమాలేం లేని శ్రీ లీలకు ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అంటే పెద్ద విషయమే అని చెప్పాలి.

Tags

Next Story