Sushmita Sen : సుస్మితా సేన్ కూల్ డ్రింక్ రివెంజ్

Sushmita Sen :  సుస్మితా సేన్ కూల్ డ్రింక్ రివెంజ్
X

సుస్మితా సేన్.. ఇండియా నుంచి మిస్ యూనివర్స్ కిరీటం అందుకున్న ఫస్ట్ లేడీ. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఓ దశలో టాప్ హీరోయిన అనిపించుకుంది. తెలుగులో కూడా నాగార్జున సరసన రక్షకుడు అనే సినిమాలో నటించింది. ఇది తనకు రెండో సినిమానే కావడ విశేషం. తన గ్లామర్ కు చాలామంది ఫిదా అయిపోయేవారు అప్పట్లో. అలాగే ఎఫైర్స్ విషయంలోనూ ఎప్పుడూ న్యూస్ లోనే ఉండేది తను. 2010లోపే తన కెరీర్ ఆల్మోస్ట్ ముగిసింది. ఆ తర్వాత కొన్ని టివి ఛానల్స్ లో గెస్ట్ గా కనిపిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు తన గురించి ఎందుకూ అంటే.. ఎవరినీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు అనేందుకు ఓ ఉదాహరణగా నిలిచింది సుస్మిత. అదేంటో ఇప్పుడు చూద్దాం.

మిస్ యూనివర్స్ కాక ముందు చిన్న చిన్న మోడలింగ్స్ చేసేది తను. ఓ సారి తనకు ఓ కూల్ డ్రింక్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. తను వెళ్లి ఆడిషన్ చేసింది. అంతా ఓకే అనుకున్నారట. కానీ సుస్మితా సేన్ కు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ కంపెనీ వాళ్లు వేరేవాళ్లతో యాడ్ చేశారు. కట్ చేస్తే అదే యేడాది.. అంటే 2004లోనే తను మిస్ యూనివర్స్ గా ఎంపికైంది. ఇంకేం.. ప్రపంచం అంతా ఆమె వైపే చూసింది.

ఇంత గొప్ప అందగత్తెను వదులుకున్నందుకు ఆ కంపెనీ కూడా తెగ ఫీలైందట. కానీ వ్యాపారాల్లో ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవు కదా.. అందుకే తను మిస్ యూనివర్స్ అయిన తర్వాత మరోసారి తన వద్దకు యాడ్ కోసం వెళ్లారట. బట్ తను మాత్రం ఈ కంపెనీకి తీవ్రంగా పోటీ ఇచ్చిన మరో కూల్ డ్రింక్ కంపెనీకి యాడ్స్ చేసింది. మొదట తనను తక్కువగా చూశారు. తను ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకోగానే మళ్లీ తన కోసం వచ్చారు తప్ప.. ఆమె ప్రతిభను నమ్మి కాదు అనేది సుస్మిత ఫీలింగ్. అందుకే మరో కంపెనీకి యాడ్ చేసింది. ఇంతకీ ఆ కూల్ డ్రింక్ కంపెనీస్ ఏంటో తెలుసా.. తనను రిజెక్ట్ చేసింది పెప్సీ అయితే.. తను సెలెక్ట్ చేసుకుంది కోకా కోలా. 90లలో సుస్మిత చేసిన కోకాకోలా యాడ్స్ తెగ పాపులర్ అయ్యాయి. అదీ మేటర్.

Tags

Next Story