చిన్నప్పుడు కూతురిగా.. పెద్దయ్యాక హీరోయిన్‌గా.. రాజశేఖర్‌తో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా

ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యారు. ఆపై ప్రాక్టీస్‌కూడా పెట్టి పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కానీ అందంగా ఉన్న అతగాడిని సినిమాల్లోకి వెళ్లమని స్నేహితులు సలహా ఇవ్వడంతో స్టెతస్కోపుని పక్కన పెట్టి కెమేరా ముందుకు వచ్చారు నటుడు డాక్టర్ రాజశేఖర్.
1985లో వందేమాతం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ప్రతిఘటన, అరుణ కిరణం, శృతి లయలు, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, మగాడు, అహంకారి, ఆగ్రహం, రాజసింహం, శిలాశాసనం, గ్యాంగ్ వార్, అల్లరి ప్రియుడు, మొరటోడు నా మొగుడు, ఎవడైతే నాకేంటి, భరత సింహారెడ్డి, గరుడవేగ, కల్కి లాంటి చిత్రాల్లో ఆయన నటించారు.
జీవితతో అనేక చిత్రాల్లో కలిసి నటించిన ఆయన చివరకు ఆమెని తన భాగస్వామిని చేసుకున్నారు. ఇదిలా ఉంటే 1989లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన మమతల కోవెల చిత్రంలో రాజశేఖర్, సుహాసిని హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో రాజశేఖర్ కూతురిగా రాశి బాలనటిగా కనిపించారు.
దాదాపు పదేళ్ల తరువాత ఇవివి సత్యన్నారాయణ దర్శకత్వంలో నేటి గాంధీ చిత్రంలో ఆయన పక్కన హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు హీరోగా వచ్చిన శుభాకాంక్షలు చిత్రం ద్వారా మొదట హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తరువాత రాజశేఖర్, వెంకటేష్, శ్రీకాంత్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com