Karthika Deepam: కార్తీకదీపంకు కష్టాలు.. తగ్గిన వంటలక్క హవా

Karthika Deepam: సంవత్సరాల తరబడి సాగదీసినా కొన్ని సీరియల్స్ బుల్లి తెర ప్రేక్షకులను బోరు కొట్టించనివ్వు. ఎప్పుడో 2017లో మొదలైంది కార్తీక దీంపం సీరియల్.. డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల, వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ పాత్రల్లో జీవించడంతో టీవీలకు అతుక్కుపోయారు తెలుగు ప్రేక్షకులు..
సినిమాలను, సీరియల్స్ ను, ఆఖరికి ఐపీఎల్ రేటింగ్స్ ని కూడా బీట్ చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది కార్తీక దీపం.. విడిపోయిన ఆ ఇద్దరు ఎప్పుడు కలుసుకుంటారో అని ఇంట్లో వాళ్ల గురించి బాధ పడిన దానికంటే ఎక్కువగా సీరియల్ లోని ఆ పాత్రల గురించి ముచ్చటించుకున్నారు.
వారి బాధను తమ బాధగా ఊహించుకున్నారు.. అలాంటి ట్విస్ట్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్ ఇన్ని సంవత్సరాలు నడిపించి ఇక చాల్లే అనుకున్నాడో ఏమో వాళ్లిద్దరినీ కలిపేశాడు.. ఇంకేం ఉంటుంది చూడ్డానికి.. ఇంక ఈ సీరియల్ గురించి ఏం మాట్లాడుకోవాలి అని కార్తీక దీపం చూడ్డం మానేశారు ప్రేక్షకులు.
దాంతో రేటింగులు ఢమాల్ అయ్యాయి. పైగా ఆ పాత్రలని చంపేసి కొత్త పాత్రలకి తెర తీశాడు దర్శకుడు. ప్రేక్షకులకు ఆ విషయం రుచించలేదు. నిరుపమ్ కూడా తనతో పాటు ప్రేమీ విశ్వనాథ్ కూడా ఈ సీరియల్ నుంచి తప్పుకున్నామని ప్రకటించారు. దీంతో కార్తీక దీపంకి కష్టాలు మొదలయ్యాయి అని భావిస్తున్నారు అందరూ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com