Gandhi Talks Trailer : గాంధీ టాక్స్ పెద్ద సౌండ్ చేస్తుందా..?

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం తమిళ్ లో ఆ మాటకొస్తే దేశం మొత్తం వచ్చిన మూవీ పుష్పక విమానం. ఇది పూర్తిగా సైలెంట్ మూవీ. ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఇదో ప్రయోగం. ఆ ప్రయోగానికి ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ తరహా సినిమా రాబోతోంది. ఆ మూవీ గురించి కొన్నాళ్లుగా మీడియాలో మాట్లాడుకుంటున్నారు కూడా. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా టైటిల్ ‘గాంధీ టాక్స్’. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితిరావు కీలక పాత్రల్లో నటించారు. ఈ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. డైలాగ్స్ లేని సినిమాలు అంటే ఈ రోజుల్లో ఊహించడం కూడా సాధ్యం కాదు. అలాంటిది ఈ మూవీ రావడం మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి.
కంటెంట్ పరంగా చూస్తే ముంబైలో సాగే సినిమాలా కనిపిస్తోంది. విజయ్ సేతుపతి తన తల్లితో కలిసి ఉంటుంటాడు. ఆమె వయసు రీత్యా అన్ని మర్యాదలూ చేస్తుంటాడు. అతనితో పాటు పక్కింట్లో ఉండే అమ్మాయిగా అదితి రావు కనిపిస్తోంది. ఇద్దరి మధ్య అనుంబంధం పెరుగుతుంది. ప్రేమలో కూడా ఉంటారు అనిపించేలా ఉంది. మరోవైపు రిచ్ మేన్ ఉంటాడు అరవింద్ స్వామి. కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత అతని రిచ్ నెస్ పోతుంది. అదెలా అనేది సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఇటు చూస్తే విజయ్ తో పాటు అదితి మధ్య ఓ సంఘర్షణ కూడా కనిపిస్తుంది. మరి సినిమా మొత్తంగా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.
ఈ ట్రైలర్ తోనే ఆకట్టుకునేలా ఉందీ టీమ్. ఏఆర్ రెహమాన్ సంగీతం హైలెట్ గా ఉండేలా ఉంది. దర్శకత్వం చేసింది కిశోర్ పాండురంగ బెలేకర్. ఈ మూవీ ఈ నెల 30నే విడుదల కాబోతోంది. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది చూద్దాం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
