Hari Hara Veera Mallu : హరి హరకు వాన గండం ఉందా..?

Hari Hara Veera Mallu  :  హరి హరకు వాన గండం ఉందా..?
X

హరిహర వీరమల్లు విడుదలకు అన్నీ క్లియర్ అయ్యాయి. అభిమానులు కూడా ఉత్సాహంగా సినిమా చూసేందుకు సిద్ధం అవుతున్నారు. ఏపిలో మిడ్ నైట్ షోస్ కోసం 700 టికెట్ ధర అయినా సరే తగ్గేదే లే అంటూ కొనేసుకున్నారు. మార్నింగ్ వరకూ ఈ మూవీకి సంబంధించిన మాగ్జిమం టాక్ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ మూవీ కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా ఒక్కసారైనా చూసేవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే అసలు ప్రాబ్లమ్ ఇప్పుడు వెదర్ వచ్చింది. ఈ వీకెండ్ వరకూ మూవీ మాగ్జిమం వసూళ్లు సాధించాలనే టార్గెట్ తో ఉంది. అయితే ఈ మూడు నాలుగు రోజుల పాటు ఏపి, తెలంగాణల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయిన వాతావరణ శాఖ ఖచ్చితంగా చెబుతుంది. వాళ్లు చెప్పినట్టుగానే గత నాలుగు రోజులుగా వానలు విస్తారంగా పడుతున్నాయి. భారీ వర్షాలే అయితే ఖచ్చితంగా హరిహర వీరమల్లు కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందనే చెప్పాలి. వానలో వెళ్లి సినిమాలు చూడటం అనేది ఎక్కువగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ చేసే పని. వారిని కూడా అడ్డుకునే కెపాసిటీ వర్షాలకు ఉంటుంది. మరి ఈ వానగండాన్ని దాటి వీరమల్లు బాక్సాఫీస్ ను గెలిస్తే అదో అద్భుతమే అవుతుంది. అఫ్ కోర్స్ అది కూడా కంటెంట్ ను బట్టే డిసైడ్ అవుతుంది.

Tags

Next Story