Robinhood Nitiin : రాబిన్ హుడ్ మళ్లీ తప్పుకోవాల్సిందేనా

ఒక టాప్ స్టార్ సినిమ వస్తోందంటే టైర్ టూ హీరోలైనా తప్పుకోవాల్సిందే అనేది సినిమా బిజినెస్ సూత్రం. లేకపోతే ఆ స్టార్ ముందు తేలిపోతారు. కమర్షియల్ గా లాస్ అవుతారు. ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప స్టార్స్ ను దాటి విజయం సాధించడం అనేది కనిపించదు. అందుకే ఇప్పుడు రాబిన్ హుడ్ కు మళ్లీ పోస్ట్ పోన్ అయ్యే టైమ్ ఫిక్స్ అయింది.
నితిన్, శ్రీ లీల జంటగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన రాబిన్ హుడ్ ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. నిజానికి క్రిస్మస్ కే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. అప్పుడు పుష్ప 2 టాప్ గేర్ లో కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఆ మూవీ కోసం రాబిన్ హుడ్ ను ఆపారు. సంక్రాంతికి ప్లాన్ చేసినా సెట్ కాలేదు. ఫిబ్రవరి కూడా దాటుకుని మార్చి 28న విడుదల అంటూ కొత్త పోస్టర్ వేశారు. అప్పటికే ఆ టైమ్ కు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఉంది. కానీ సడెన్ గా వీళ్లు రిలీజ్ డేట్ వేసేసరికి వీరమల్లు వాయిదా పడిందేమో అనుకున్నారు. బట్ అలాంటిదేం లేదని లేటెస్ట్ అప్డేట్స్ చెబుతున్నాయి. ఇప్పటికే వీరమల్లు నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది. సెకండ్ సాంగ్ ను ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. తాజాగా నిర్మాత ఏఎమ్ రత్నం బర్త్ డే సందర్భంగా హరిహర వీరమల్లు మార్చి 28కే వస్తుందని కుండబద్ధలు కొట్టారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ వస్తే నితిన్ కు ఇబ్బందే. అసలే కెరీర్ స్లంప్ లో ఉందిప్పుడు. ఈ టైమ్ లో పవర్ స్టార్ తో పెట్టుకుంటే అసలుకే మోసం వస్తుంది. సో రాబిన్ హుడ్ మళ్లీ తప్పుకోబోతోంది అని స్ట్రాంగ్ గా వినిపిస్తుంది.
రాబిన్ హుడ్ తో పాటు నాగవంశీ నిర్మించిన మ్యాడ్ 2 కూడా పోస్ట్ పోన్ అవుతుంది. ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేస్తాం అన్నారు. బట్ పవన్ తో నాగవంశీకి ఉన్న అనుబంధాన్ని బట్టి తను వాయిదా వేసుకుంటాడు. ఇక మిగిలింది రెండు డబ్బింగ్ సినిమాలు. తమిళ్ నుంచి విక్రమ్ హీరోగా నటించిన వీర ధీర శూరన్ తో పాటు మళయాల లూసీఫర్ సీక్వెల్ ఎంపూరన్. ఈ రెండూ మార్చి 27న రిలీజ్ అవుతున్నాయి. సో.. పవన్ వల్ల వీరికి తెలుగులో ఏదైనా ఇబ్బంది వస్తుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com