Suriya : సూర్య ఇలా అనడం సిగ్గు అనిపించడం లేదా..?

నటుడుగా సూర్య ఎంత టాలెంటెడో అనేది అందరికీ తెలుసు. ఎన్నో గొప్ప పాత్రల్లో అద్భుతంగా రాణించాడు. కమర్షియల్ హీరోగా కూడా చాలా సినిమాల్లో సత్తా చాటాడు. కాకపోతే కొన్నేళ్లుగా అసలు హిట్ అనే మాటే వినిపించడం లేదు. ఈ ఏడెనిమిదేళ్లలో ఆకాశం నీ హద్దురా, జై భీమ్ లాంటి ఓటిటి మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయి. మిగతావన్నీ పోయాయి. పోతున్నాయి కూడా. ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వీరభద్రుడు అనే మూవీతో వస్తున్నాడు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. తనకు హిట్ లేదు అనే భయం వల్లో ఏమో.. తమ్ముడు కార్తీని కూడా తీసుకువచ్చాడు. ఈ మూవీ ట్రైలర్ కూడా అస్సలే మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఒకవేళ అట్రాక్ట్ అయితే కేవలం తమిళ్ ఆడియన్స్ కు మాత్రమే సెట్ అయ్యేలా ఉంది తప్ప.. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలేవీ ట్రైలర్ లో లేవు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య చెప్పిన మాటలు మాత్రం తెలుగువాళ్లకు దారుణంగా అనిపించాయి.
వీరభద్రుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య మాట్లాడాడు. మామూలుగా ఇలాంటి ఈవెంట్స్ లో డబ్బాలు కొట్టుకోవడమే కదా కనిపిస్తుంది. అలాగే ఇదీ ఉంది. తెలుగు వాళ్లు గొప్పవాళ్లు.. తెలుగు ప్రేక్షకులు మాకు దేవుళ్లు అంటూ రొటీన్ డైలాగ్స్ వేశాడు. అయితే ఈ మాటల్లో వినిపించిన దారుణమైనది ఏంటీ అంటే.. సూర్య ఇప్పటికి 28యేళ్లుగా తెలుగు సినిమాలు చేస్తున్నాను. అప్పటి నుంచి తెలుగు వాళ్లు అంటే నాకు ఇష్టం అన్నాడు. అంటే 28యేళ్లు అవుతున్నా అతను ఇప్పటి వరకు కనీసం తెలుగు మాట్లాడ్డం రాదు. తెలుగువాళ్ల డబ్బులు కావాలి.. కానీ తెలుగు మాత్రం రాదు. ఇదెలా..? అసలు ఇన్నేళ్లుగా ఎన్ని ఈవెంట్స్ చేస్తున్నాడు. ఇప్పటికీ కనీసం తెలుగు రాదు అంటే ఏం చెప్పాలి. నిజానికి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఒకట్రెండు సార్లు మాట్లాడిన విజయ్ కూడా ఇంతకంటే బాగా తెలుగులో మాట్లాడాడు. చాలాయేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ బంగారం మూవీ ఈవెంట్ లోనే విజయ్ తెలుగులో చాలా వరకు మాట్లాడాడు. అలాంటిది తెలుగు డబ్బింగ్ మూవీస్ కు సంబంధించి ప్రతి ఈవెంట్ లోనూ పాల్గొంటున్నాడు సూర్య... కనీసం తెలుగులో మాట్లాడ్డం రాదు అనడం ఏమాత్రం నచ్చలేదు అంటున్నారు అభిమానులు. ఏదేమైనా ఇప్పటికైనా తెలుగు నేర్చుకుని తెలుగులోనే మాట్లాడితే బావుంటుంది. ఆ మాటకొస్తే తమిళ్ వాళ్లు తమిళ్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారు. మరి తెలుగును ఎందుకంత లైట్ తీసుకుంటున్నారో తెలియదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
