Balakrishna : బాలయ్య బర్త్ డే స్సెషల్ అప్డేట్ ఇదే

Balakrishna :  బాలయ్య బర్త్ డే స్సెషల్ అప్డేట్ ఇదే
X

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ తో దూకుడుగా ఉన్నాడు. వరుసగా ఒకదాన్ని మించిన విజయం మరోటిగా కనిపిస్తోంది. అందుకే ఆ జోష్ కూడా కనిపిస్తోందాయనలో. ప్రస్తుతం అఖండ 2తో వస్తున్నాడు. అఖండకు సీక్వెల్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేస్తారు అనే ప్రచారం ఉంది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఈ సారి డబుల్ డోస్ తో కనిపిస్తుందని చెబుతున్నారు. ప్రగ్యా జైశ్వాల్ తో పాటు ఈ సారి సంయుక్తను కూడా తీసుకున్నారు. ఈ తరహా చిత్రాలతో సంయుక్త బాగా ఆకట్టుకుంటోంది. మంచి పర్ఫార్మర్ కూడా కావడంతో తనూ అఖండ 2కు మరో ఎసెట్ అవుతుందనుకోవచ్చు.

అఖండ 2 తర్వాత నెక్ట్స్ గోపీచంద్ మలినేనితో సినిమా ఉండబోతోంది. గోపీచంద్ ఆల్రెడీ బాలయ్యతో వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి ఉన్నాడు. ఈ సారి ఆ బ్లాక్ బస్టర్ ను మించే కథతో వస్తున్నాడనే టాక్ ఉంది. ఇక ఈ సారి కూడా బాలయ్య డ్యూయొల్ చేయబోతున్నాడు. వీరసింహారెడ్డిలో తండ్రి కొడుకులుగా నటించాడు. ఈ సారి కూడా ఆ తరహా పాత్రలతోనే కనిపించబోతున్నాడట. ఈ మేరకు పక్కా స్క్రిప్ట్ తో బాలయ్యను ఒప్పించి రెడీగా ఉన్నాడు గోపీచంద్.

ఈ మూవీ బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా జూన్ 10న అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. అంటే బాలయ్య బర్త్ డే స్పెషల్ గా ఈ కొత్త సినిమా ప్రారంభం అవుతుందన్నమాట. వృద్ధి సినిమాస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. దీంతో పాటు అఖండ 2 నుంచి ఓ పవర్ ఫుల్ టీజర్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. అదే నిజమైతే ఫ్యాన్స్ కు బర్త్ డే సందర్భంగా డబుల్ ట్రీట్ అందినట్టే అనుకోవాలి.

Tags

Next Story