Double Ismart 1st Day Collections : డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత ..?

Double Ismart 1st Day Collections :   డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత ..?
X

పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీకి బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ వచ్చింది. పూరీ పూర్తిగా ప్రేక్షకులతో డిస్ కనెక్ట్ అయిపోయాడు అంటున్నారు. అస్సలే మాత్రం కన్విన్సింగ్ గా లేని కథ, కథనాలతో భారీగా ఖర్చు పెడుతూ పూరీ రూపొందించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ హిట్ అనే మాట వినడం అసాధ్యం అనే చెప్పాలి. రామ్ క్యారెక్టరైజేషన్ మాత్రం ఎనర్జిటిక్ గా ఉన్నా.. స్టోరీ సిల్లీగా ఉండటం.. అవుట్ డేటెడ్ నెరేషన్ తో పాటు కామెడీ ట్రాక్ పేరుతో అలీతో చేయించిన కామెడీ అపహాస్యం పాలైంది. అసలే పూరీ ఓపెనింగ్స్ కు దూరమై చాలాకాలం అవుతోందంటే దానికి తోడు సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో ఇస్మార్ట్ శంకర్ కంటే వెనక బడింది.

డబుల్ ఇస్మార్ట్ మూవీకి ఓపెనింగ్స్ వీక్ గానే వచ్చాయి. మొదటి రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 5 కోట్లు( షుమారు) వసూళ్లు మాత్రమే సాధించిందీ మూవీ. దీనికి కాస్త అటూ ఇటూగా కొన్ని ఫిగర్స్ మారొచ్చేమో కానీ మాగ్జిమం అయితే ఇదే అంటున్నారు. నిజానికి ఈ మూవీ రైట్స్ ను 40 కోట్లు పెట్టి కొన్నారు. ఓపెనింగ్స్ చూస్తే ఆ నలభైలో సగానికి పైగా లాస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రామ్ ఎనర్జీ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైందనే చెప్పాలి. ఆ మాటకొస్తే రామ్ కూడా ఇప్పుడు వరుసగా నాలుగు ఫ్లాపులు ఇచ్చి ఉన్నాడు. ఇది మరోటవుతుందేమో అంతే.

విశేషం ఏంటంటే.. అసలే మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు ఫస్ట్ డే ఓపెనింగ్స్ 7.65 కోట్లకు పైగా వచ్చాయి. అంటే హిట్ బొమ్మకు సీక్వెల్ అయినా.. రిలీజ్ కు ముందు బజ్ క్రియేట్ చేసినా ఓవరాల్ గా డబుల్ ఇస్మార్ట్ ను తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేశారు అనే చెప్పాలి. ఇక హిందీతో పాటు ఓవర్శీస్ మొత్తం కలిపి ఓ భారీ ఫిగర్ తో వీళ్లు ప్రేక్షకుల ముందుకు వస్తారు. అది నిజమా కాదా అని పూరీ జగన్నాథ్ నెక్ట్స్ సినిమా టైమ్ లో ముందుకు వచ్చి ఆందోళన చేసే డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ ను చూస్తే తెలుస్తుంది.

Tags

Next Story