Double iSmart : డబుల్ ఇస్మార్ట్.. 8 మిలియన్ ప్లస్
రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబోలో వస్తున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. రిలీజైన 24 గంటల వ్యవధిలో 8 మిలియన్ కు పైగా వ్యూస్ రావడం విశేషం. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా.. సంజయ్ దత్ విలన్ పాత్ర పోషించారు. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. పూరీ, రామ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి సీక్వెల్ గా "డబుల్ ఇస్మార్ట్" తెరకెక్కింది. దాదాపు రెండున్నర నిమిషాలకు పైగా నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్.. ప్రారంభం నుండి చివరి వరకు పూర్తిగా ఎంటర్టైనింగ్ గా, ఎంగేజింగ్ గా సాగింది. ఎనర్జిటిక్ క్యారక్టర్ తో, తన మెంటల్ మాస్ యాక్షన్ హంగామాతో ఆకట్టుకున్నారు. కావ్య థాపర్ అందంగా కనిపించింది. రామ్, కావ్యల మధ్య నడిచే లవ్ ట్రాక్, వాళ్లిద్దరి కెమిస్ట్రీ అలరించిందిటైలర్ తో ఆడియన్స్ లో అంచనాలు రెట్టింపు చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ.. సరిగ్గా మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఆగస్ట్ 15వ తేదీన తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com