Double iSmart : డబుల్ ఇస్మార్ట్.. మూడో పాట రిలీజ్

Double iSmart : డబుల్ ఇస్మార్ట్.. మూడో పాట రిలీజ్

పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఆగస్టు 15న రాబోతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. రామ్ పోతినేని హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చేశాయి. ఇవాళ మూడో పాట కూడా విడుదలైంది. ఈ సాంగ్ ట్యూన్ ఇంట్రెస్టింగ్ గా ఉండటం విశేషం. సింపుల్ గానే ఉన్నా లిరిక్స్ ఇంపాక్ట్ గా ఉన్నాయి. మణిశర్మ డిఫరెంట్ కంపోజిషన్ పాటను కొత్తగా ప్రజెంట్ చేసింది. ధనుంజయ్, సింధూజ గాత్రంలో కాస్త హస్కీగా ఇంకాస్త విస్కీ కొట్టినట్టుగా పాట మత్తుగా వినిపిస్తోంది. ఇదే ఈ సాంగ్ లో ఉన్న వైవిధ్యంగానూ కనిపిస్తోంది. పూరీ సినిమాల్లో లవ్ సాంగ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ కొత్తదనం ఈ పాటలోనూ కనిపిస్తోంది. లవ్ లో పడ్డ కొత్త జంట పాడుకునే పాటలా ఉంది. బట్ ట్యూన్, లిరిక్స్, మేకింగ్ పూర్తిగా పూరీ జగన్నాథ్ స్టైల్లో ఉంది. ఇప్పటి వరకూ వచ్చిన పాటల కంటే ఇది కాస్త స్లో ఉన్నా.. ఎక్కువ సార్లు వినబోయే పాటలా మాత్రం కనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తోన్న ఈ డబుల్ ఇస్మార్ట్ తో పూరీ అండ్ రామ్ హిట్ కొడతారా అనేది చూడాలి.

Tags

Next Story