Double Ismart : డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్.. మళ్లీ చిప్ దొబ్బుతుందా ..

Double Ismart :   డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్.. మళ్లీ చిప్ దొబ్బుతుందా ..

రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తోన్న మూవీ డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ విడుదలైంది. ఫస్ట్ పార్ట్ ఇస్మార్ట్ శంకర్ కు డబుల్ డోస్ అన్నట్ఉటగా ఉందీ ట్రైలర్. పూరీ నుంచి ఎక్స్ పెక్ట్ చేసే అన్ని మసాలా ఐటమ్స్ ఉన్నాయి. రామ్ మరోసారి ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టబోతున్నాడని అర్థం అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ లో సత్యదేవ్ బ్రెయిన్ నుంచి చిప్ తీసి శంకర్ కు పెట్టినట్టు ఈ మూవీలో కూడా మరోసారి చిప్ దొబ్బేసి విలన్ చిప్ రామ్ కు అమర్చినట్టు చూపించారు. ప్రాక్టికల్ గా ఇది సాధ్యమా అనేది పక్కన బెడితే మళ్లీ వీడికే పెట్టారా అంటూ షాయాజీ షిండే చెప్పే డైలాగ్ ను బట్టి పూరీ ఏం మారలేదు అనేది అర్థం చేసుకోవచ్చు.

హీరోయిన్ కావ్య థాపర్ తో శృతి మించిన ఎక్స్ పోజింగ్ చేయించారు. అందుకు ఆవిడకు కూడా ఏం అభ్యంతరం లేనట్టుగానే కనిపించింది. డైలాగ్స్ అన్నీ పూరీ స్టైల్లో డాషింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా రామ్.. గెటప్ శీనుతో చెప్పిన ' అన్నేమో ఛార్మినార్, వదినేమో కుతుబ్ మినార్ .. రెండూ గుద్దుకుంటే.. " అనే డైలాగ్ భాగ్యనగర్ కథను చెబుతోంది. అదే టైమ్ లో 'మన పెళ్లికి మీ సైడ్ నుంచి ఎవరొచ్చినా కాల్చి పడదొబ్బుతా" అనే డైలాగ్ సైతం పూరీకి మాత్రమే సాధ్యమయ్యేది.

ఇక పూరీకి ఎప్పుడూ ఎసెట్ గా నిలిచే అలితో స్పెషల్ ట్రాక్ పెట్టినట్టున్నారు. ఉన్న రెండు డైలాగ్స్ లోనూ రెండు బండ బూతులు కనిపించాయీ పాత్రలో. మరి సినిమా సంగతి పక్కన బెడితే సెన్సార్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వస్తాయనేది చూడాలి. సంజయ్ దత్ కు చెప్పిన డబ్బింగ్ అతకలేదు. ఇస్మార్ట్ శంకర్ చిప్ లో ఉన్న సమాచారం దొబ్బేయడానికి సంజయ్ దత్ ఇతన్ని పట్టుకుని తన బ్రెయిన్ ను అతనికి అమర్చుతాడు. కట్ చేస్తే తనూ అతన్లానే బిహేవ్ చేస్తూ రెడ్ బుల్ లా మారిపోతాడు.

ఓవరాల్ గా చూస్తే ఇదో లాటరీ మూవీలా కనిపిస్తోంది. అంటే తగిలితే బ్లాక్ బస్టర్ లేదంటే ఫట్టు అన్నట్టుగా ఉంది. పూరీ జగన్నాథ్ లో విషయం అయిపోయి చాలాకాలం అయింది. అంచేత ఇంతకు మించి అతన్నుంచి ఎక్స్ పెక్ట్ చేయలేం. పైగా ఈ మధ్య కాలంలో ఇంత ఊరమాస్ మూవీ రాలేదు కాబట్టి ఇది సెట్ అయ్యే అవకాశాలున్నాయి. సో.. మిస్టర్ బచ్చన్ తో పోటీకి డబుల్ డోస్ తో రెడీగా ఉన్నాడు పూరీ. మరి ఆగస్ట్ 15న విడుదల కాబోతోన్న డబుల్ ఇస్మార్ట్.. ఇస్మార్ట్ శంకర్ ను మించిన విజయం సాధిస్తుందా లేక చతికిల పడుతుందా అనేది చూడాలి.

Tags

Next Story