Vishwak Sen : లైలాతో విశ్వక్ సేన్ కు డబుల్ లాస్

Vishwak Sen  :  లైలాతో విశ్వక్ సేన్ కు డబుల్ లాస్
X

విశ్వక్ సేన్.. ఒకటీ రెండు విజయాలతో తెలుగులో తన ముద్ర వేశాడు అనే కంటే తనదైన యాటిట్యూడ్ తోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ యాటిట్యూడ్ చాలామందికి నచ్చదు కూడా. అది వేరే విషయం. లేటెస్ట్ గా రిలీజ్ కు ముందు అనుకోని వివాదాలతో రిలీజ్ అయిన లైలా విషయంలో మాత్రం దారుణంగా షాక్ తిన్నాడు విశ్వక్ సేన్. ఈ మూవీకి యూనానిమస్ గా డిజాస్టర్ టాక్ వచ్చింది. ఏ ఒక్కరూ ఫర్వాలేదు అని కూడా చెప్పడం లేదు. ఆ రేంజ్ డిజాస్టర్ చూశాడు. అఫ్ కోర్స్ ఫ్లాప్ లు విశ్వక్ సేన్ కు అస్సలు కొత్త కాదు. కానీ ఈ తరహా సినిమా వల్ల వ్యక్తిగతం కూడా డ్యామేజ్ జరిగింది. అడల్డ్ కామెడీతో పాస్ అయిపోవచ్చు అనుకున్నాడు కానీ అది అభాసుపాలైంది. చాలా సినిమాల్లో అక్కడక్కడా కొన్ని అడల్ట్ డైలాగ్స్ పడొచ్చు. కానీ ఈ సినిమాలో అవే ఎక్కువగా ఉండటం.. అవన్నీ ఫోర్స్ డ్ గా కనిపించడంతో పాటు అర్థం లేని రచన, బోరింగ్ స్క్రీన్ ప్లే, హీరోయిన్ తో వాంటెడ్ గా చేయించిన స్కిన్ షో.. ఇవన్నీ అదనంగా మైనస్ అయ్యాయి. అందుకే లైలా అందరి నుంచీ ఒకటే టాక్ ను అందుకుంది. ఇది ఒక లాస్ అనుకుంటే.. ఈ మూవీతో విశ్వక్ సేన్ కు మరో డ్యామేజ్ కూడా ఉంది.

మామూలుగా విశ్వక్ కాస్త అగ్రెసివ్ గా కనిపిస్తాడు. ప్రమోషన్స్ లో చేసిన అతి కావొచ్చు.. కాంట్రవర్శీ తర్వాత చేసిన ఓవరాక్షన్ కావొచ్చు.. ఇమేజ్ కూ డ్యామేజ్ అవుతాయి. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండి.. ఈ తరహా సినిమా చేసినప్పుడు ఆ విషయంపై కాస్త అప్రమత్తంగా ఉండాల్సింది పోయి.. అతిగా పోయాడు అంటున్నారు. అలాగే ఈ టైప్ బి గ్రేడ్ మూవీస్ వల్ల ఎంత కాదని చెప్పినా ‘కాంపౌండ్స్’లోనూ మైనస్ అవుతుంది. కొన్నాళ్లుగా నందమూరి హీరోలతో సన్నిహితంగా ఉంటున్నాడు. అందులో తప్పేం లేదు. బట్ లైలా లాంటి మూవీస్ చేస్తూ సమర్థించుకుంటే రేపు ఆ హీరోలు కూడా దూరం పెట్టేస్తారు. సో.. ఎంచుకునే కథల్లో క్వాలిటీ ఉండాలి. అప్పుడు అతను అనుకున్నది సాధిస్తాడు. లేదంటే ఇలా అభాసుపాలు కావాల్సి ఉంటుంది.

Tags

Next Story