Double Ismart : డబుల్ ఇస్మార్ట్ సెన్సార్ టాక్.. మరో సీక్వెల్ ఉందా.

Double Ismart : డబుల్ ఇస్మార్ట్ సెన్సార్ టాక్.. మరో సీక్వెల్ ఉందా.

రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీని ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పూరీ, రామ్ ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్థితిలో ఉన్నారిప్పుడు. వారికీ డబుల్ డోస్ ఇచ్చే హిట్ లోడ్ అవుతుందనే టాక్ వచ్చింది. ఈ మధ్య రామ్, పూరీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా పర్ఫార్మ్ చేయడం లేదు. దీంతో ఈ మూవీకి బిజినెస్ కష్టం అనుకున్నారు చాలామంది. బట్ రిలీజ్ కు ముందే గ్రాండ్ గా బిజినెస్ కూడా అయింది. సో.. మొత్తంగా ఈ మూవీ టీమ్ చాలా హ్యాపీగా రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇక లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకుంది డబుల్ ఇస్మార్ట్. ఊహించినట్టుగానే ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్ వచ్చింది. ట్రైలర్ చూసినప్పుడే ఇది ఏ సర్టిఫికెట్ సినిమా అనుకున్నారు. అలాగే ఏ వచ్చింది. సెన్సార్ టీమ్ నుంచి కూడా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినట్టు చెబుతున్నారు. అలాగే మూవీ క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ ఉంటుందట. ఆ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని టాక్. ఈ ట్విస్ట్ తో మరో పార్ట్ ను సెట్ చేసుకున్నాడు పూరీ అంటున్నారు. అంటే ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్.. నెక్ట్స్ మరో త్రిబుల్ ఇస్మార్ట్ లాగా అన్నమాట. మరి ఇదే నిజమైతే తెలుగులో 'పూరీ వర్స్" క్రియేట్ అవుతుందేమో.

Tags

Next Story