Double Ismart : డబుల్ ఇస్మార్ట్ .. అందరికీ పరీక్షే
పూరీ జగన్నాథ్.. ఒకప్పుడు డాషింగ్ డైరెక్టర్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. ప్రతి హీరో అతని డైరెక్షన్ లో నటించాలని కోరుకునేలా చేశాడు. టాలీవుడ్ హీరోయిజం రూపు రేఖలను మార్చిన దర్శకుల్లో పూరీ స్పెషాలిటీ, స్టైల్ మరే దర్శకుడికీ రాలేదు. అదే టైమ్ లో హీరోయిన్లను మరీ దిగజారుడుగా చూపించాడు అనేదీ వాస్తవం. ఏదైతేనేం హిట్స్ ఉంటే ఏం చేసినా చెల్లుతుంది. అయితే ఎలాంటి కథలైతే తనకు హిట్స్ ఇచ్చాయో ఆ కథలనే అటూ ఇటూ తిప్పుతూ హీరోలను మారుస్తూ వచ్చాడు.. అచ్చం మరో దర్శకుడు తేజ లాగా. దీంతో ఓ దశలో మొనాటనీ వచ్చేసింది. ఫ్లాపులు వరస కట్టాయి. మధ్యలో పైసా వసూల్( కమర్షియల్ గా ), టెంపర్, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్స్ పడ్డాయి. ఇస్మార్ట్ తర్వాత మళ్లీ పుంజుకున్నా అనుకున్నాడు. దీంతో విజయ్ దేవరకొండతో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటూ చాలా హంగామాతో లైగర్ మొదలైంది. టైటిల్ చూసినప్పుడే తేడాగా ఉందన్నారు జనం. బట్ అతను ఎప్పట్లాగే ఎవరినీ పట్టించుకోలేదు. భారీ అంచనాలతో వచ్చిన లైగర్ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ప్లేస్ సంపాదించుకుంది.
ఇటు రామ్.. తన ఇమేజ్ కు తగ్గ కథలు సెలెక్ట్ చేసుకోవడంలో ఎప్పుడూ ఫెయిల్ అవుతున్నాడు. తనకు హిట్స్ గా ఉన్న సినిమాలే అతని ఇమేజ్ అనేది వాస్తవం. అయితే ఇస్మార్ట్ శంకర్ అతనిలో కొత్త యాంగిల్ ను చూపించింది. కానీ ఒక హిట్ పడితే మూడు నాలుగు ఫ్లాపులు చూస్తున్నాడు. ఇస్మార్ట్ తర్వా కూడా రెడ్, ది వారియర్, స్కంద అంటూ హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. ఇప్పుడు ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్థితిలో పూరీతో కలిసి డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్నాడు.
హీరోయిన్ కావ్య థాపర్ కు తెలుగులో ఫస్ట్ హిట్ పడాల్సి ఉంది. నిర్మాత ఛార్మీ తనపై వచ్చే కమెంట్స్ పోవాలంటే ఈ మూవీ హిట్ కావాలి. అలాగే ఈ చిత్రాన్ని విడుదల చేస్తోన్న ప్రైమ్ షో వాళ్లకూ ఇదో పెద్ద టాస్క్ అనే చెప్పాలి. వాళ్లు 55 కోట్లకు కొని ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నారు. వాళ్లు కొన్నప్పుడు పెద్దగా పోటీ లేదు. బట్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్, తంగలాన్, ఆయ్ లాంటి మూవీస్ ఉన్నాయి. సో.. 55 కోట్లు రికవర్ అవడం అంత సులువేం కాదు. సినిమా మరీ అవుట్ స్టాండింగ్ గా ఉందనే టాక్ వస్తే సాధ్యం కాదు. పైగా అటు వైపు మూవీస్ యావరేజ్ అనేలా ఉండాలి కూడా.
ఫ్లాపుల్లో ఉన్న పూరీ, ఛార్మీ, రామ్, కావ్య థాపర్ తో పాటు ఈ మూవీ ప్రైమ్ షో వాళ్లకూ చాలా పెద్ద పరీక్షే. మరి ఈ పరీక్షలో వీళ్లు నెగ్గుతారా లేదా అనేది చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com