Double Ismart Trailer Venue : డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ వెన్యూ మారింది

Double Ismart Trailer Venue : డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ వెన్యూ మారింది
X

పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వస్తోన్న రెండో సినిమా డబుల్ ఇస్మార్ట్ మూవీ ఈ నెల 15న విడుదల కాబోతోంది. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్. బాలీవుడ్ బిగ్గీ లక్కీ, సౌత్ కు లక్కీ విలన్ గా మారిన సంజయ్ దత్ విలన్ గా నటించాడు. సినిమాపై అంచనాలు పెంచడంలో బాగా సక్సెస్ అయ్యాడు పూరీ జగన్నాథ్. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గ్రాండ్ గానే జరిగింది. లైగర్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకుని నిర్మాతగానూ భారీగా నష్టపోయాడు పూరీ జగన్నాథ్. తనతో పాటు సహ నిర్మాతగా ఉన్న ఛార్మీ కూడా పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయింది. అందుకే ఈ మూవీకి ఫైనాన్సియల్ గా చాలా ఇబ్బందులు పడ్డారు అనే టాక్ వచ్చింది. అందుకే మార్చిలో రిలీజ్ కావాల్సిన డబుల్ ఇస్మార్ట్ ఆగస్ట్ 15 వరకూ వచ్చింది. ఏమైతేనేం.. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు గ్రాండ్ గానే విడుదల కాబోతోంది. ఇక ఈ నెల 4న ట్రైలర్ లాంచింగ్ ఉంటుందని అనౌన్స్ చేసిన దగ్గర్నుంచీ రామ్ తో పాటు పూరీ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా చూస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లో కాక వైజాగ్ లో నిర్వహించబోతున్నారు.

మామూలుగా ఇలాంటి భారీ ఈవెంట్స్ అన్నీ హైదరాబాద్ లోనే జరుగుతాయి. తర్వాత అవసరమైతే.. మరో ఈవెంట్ ను అక్కడ ప్లాన్ చేసుకుంటారు. బట్ వీళ్లు ఫస్ట్ బిగ్ ఈవెంట్ నే వైజాగ్ లో నిర్వహించబోతున్నారు. వైజాగ్ లో ఈ ఆదివారం సాయంత్రం నుంచి గురజాడ కాళేశ్వరంలో ఈవెంట్ జరగబోతోంది. సో.. ఉత్తరాంధ్ర పూరీ, రామ్ ఫ్యాన్స్ అక్కడ హంగామా చేయబోతున్నారన్నమాట,.

Tags

Next Story