8 నెలల గర్భవతి.. గుండెపోటుతో మృతి చెందిన నటి

8 నెలల గర్భవతి.. గుండెపోటుతో మృతి చెందిన నటి
మలయాళ నటి రెంజూషా తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన కొద్ది రోజులకే, మంగళవారం మరో నటి మరణించడం ఇండస్ట్రీని విషాదంలో ముంచింది.

మలయాళ నటి రెంజూషా తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన కొద్ది రోజులకే, మంగళవారం మరో నటి మరణించడం ఇండస్ట్రీని విషాదంలో ముంచింది. డాక్టర్ ప్రియ ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్నారు. ఆమెకు ఆ సమయంలో గుండెపోటు రావడంతో మృతి చెందారు.

మలయాళ టీవీ నటి డాక్టర్ ప్రియ కరుతముత్తు అనే టీవీ సిరీస్‌లో కనిపించారు. మరి కొద్ది రోజుల్లో ఆమె తన మొదటి బిడ్డకు జన్మనిచ్చేవారు. కానీ అంతలోనే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. డాక్టర్ ప్రియ ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న సమయంలో గుండెపోటుకు గురవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచింది. 35 సంవత్సరాల వయస్సులో గర్భం ధరించిన ఆమె ఆరోగ్యంగానే ఉందని డాక్టర్లు వివరించారు. కానీ హఠాత్తుగా గుండె ఆగిపోవడంతో మరణించారు.

అనేక టీవీ షోలలో కనిపించే నటుడు కిషోర్ సత్య, డాక్టర్ ప్రియ మరణించిన వార్తలను ధృవీకరించారు. సోషల్ మీడియాలో ఈ హృదయ విదారక వార్తను షేర్ చేశారు. దురదృష్టకర సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది టీవీ యూనిట్. దివంగత నటి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

గర్భం దాల్చి మూడో త్రైమాసికంలో అడుగుపెట్టిన తర్వాత ప్రియ పని నుండి విరామం తీసుకుంది. ఆమె జీవితంలో కొత్త దశలోకి ప్రవేశించడం చూసి ఆమె కుటుంబం, స్నేహితులు ముచ్చటపడ్డారు. ఆమెను మళ్లీ తెరపై చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు కూడా. ఆమె గుండె ఆగిపోయినప్పుడు రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెక్-అప్ కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు నివేదించబడింది.

విధి యొక్క క్రూరత్వాన్ని వ్యక్తపరిచే తన సుదీర్ఘ నోట్‌లో, యువకులు, డైనమిక్ వ్యక్తులు ఇటువంటి దురదృష్టకర సంఘటనల వలన ప్రాణాలు కోల్పోతున్నారని సహ నటుడు సత్య నోట్ లో ప్రస్తావించారు. మలయాళ సినిమా, టీవీ పరిశ్రమకు ఇది నిజంగా కష్టకాలం అని ఆయన పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story