Kayadu Lohar : తమిళ్ లో హిట్ కొట్టింది.. తెలుగులో ఆఫర్ పట్టేసింది.

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందని, ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి లాభం అని తెలుగులో చాలా సామెతలు ఉన్నాయి. ఇక్కడ కొట్టుకోవడం, పోరు పెట్టుకోవడం లాంటివేం లేవు కానీ.. ఇద్దరు హీరోయిన్ల మధ్య ఉన్న ఆఫర్ ను మూడో హీరోయిన తన్నుకుపోయింది. ఇది ఎవరూ ఊహించలేదు కూడా. నిజానికి ఇండస్ట్రీలో ఇలాంటివి కామనే. ఎందుకంటే ఇక్కడ హిట్స్ ను బట్టే కదా ఆఫర్స్ ఉంటాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే..ప్రస్తుతం లైలా మూవీతో డిజాస్టర్ చూసి అభాసుపాలు కూడా అయిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు.
ఫంకీ అనే టైటిల్ తో రూపొందబోతోన్న ఈ చిత్రంలో ముందుగా కృతిశెట్టి లేదా అషికా రంగనాథ్ ను తీసుకోవాలనే ప్రయత్నాలు చేశారు అనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కృతిశెట్టికి తెలుగులో సినిమాలేం లేవు. అన్నీ తమిళ్ లోనే ఉన్నాయి. దీంతో ఉప్పెన బ్యూటీకి ఓ ఆఫర్ వస్తుందేమో అనుకున్నారు అభిమానులు. అలాగే నా సామిరంగారాతో ఆకట్టుకున్న అషికా రంగనాథ్ ను కూడా అనుకుంటున్నట్టు న్యూస్ వినిపించాయి. బట్ ఈ ఇద్దరినీ కాదని లేటెస్ట్ గా డ్రాగన్ మూవీతో హిట్ కొట్టిన తెల్లపిల్ల కయాడు లోహర్ ను తీసుకుంటున్నారట.
విశేషం ఏంటంటే.. కయాడు తెలుగు తెరకు కొత్తేం కాదు.. 2022లో శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి అనే సినిమాలో హీరోయిన్ ఈవిడే. ఆ సినిమా పోవడంతో అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదీ పాపను. బట్ డబ్బింగ్ మూవీ డ్రాగన్ తో అందాల ప్రదర్శనతో పాటు మంచి నటన కూడా చూపించింది. మామూలుగానే సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చెలరేగుతుందీ అస్సాం భామ. ఇక హిట్ కూడా వచ్చింది కాబట్టి ఇంకేం.. డిమాండ్ పెరుగుతుంది. పైగా సితార బ్యానర్ లో అంటే ఒక్క సినిమాతోనే అయిపోదు కదా..? గ్యారెంటీగా మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ పడ్డా ఆశ్చర్యం లేదు.
సో.. విశ్వక్ సేన్ ఫంకీలో కయాడు లోహర్ హీరోయిన్ గా ఫైనల్ అయినట్టే అన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com