Pradeep Ranganathan : ప్రేమలు బ్యూటీతో డ్రాగన్ రొమాన్స్

Pradeep Ranganathan  :  ప్రేమలు బ్యూటీతో డ్రాగన్ రొమాన్స్
X

ఏ హీరో అయినా వంద కోట్ల క్లబ్ లో చేరాలనుకుంటాడు. నెపో కిడ్స్ అయితే వర్కవుట్ అయ్యే అవకాశం ఉంది కానీ.. అవుటర్స్ కు అది అంత సులువు కాదు. అలాంటి చోట బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల క్లబ్ లో చేరారు అంటే వారిది లక్ కాదు. ఖచ్చితంగా హార్డ్ వర్క్ అవుతుంది. ఆ వర్క్ తోనే ఈ ఫీట్ సాధించిన తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్. తనే డైరెక్ట్ చేస్తూ నటించిన లవ్ టుడే తో పాటు రీసెంట్ గా అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో వచ్చిన సెన్సేషనల్ మూవీ డ్రాగన్ తో మరోసారి వంద కోట్ల క్లబ్ లో చేరి కోలీవుడ్ లోనే కాక టాలీవుడ్ లో సైతం టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు ప్రదీప్. అంతేకాదు.. డ్రాగన్ విడుదలకు ముందే తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ తో ఓ సినిమాకు సైన్ చేసి ఉన్నాడు. నిజానికి ప్రదీప్ ప్రతిభను ముందుగా గుర్తించిన మైత్రీ వారికీ అభినందనలు తెలపాల్సిందే.

ఇక త్వరలోనే ప్రారంభం కాబోతోన్న ప్రదీప్ తెలుగు మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. అతని ఫస్ట్ మూవీ లవ్ టుడేలో ఒకే హీరోయిన్. డ్రాగన్ లో ఇద్దరు హీరోయిన్లైతే ఇప్పుడు మైత్రీ బ్యానర్ లో సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారట. ఆ ముగ్గురిలో ఓ భామగా ప్రేమలుతో ఓవర్ నైట్ మళయాలంతో పాటు తెలుగులోనూ ఫేమ్ అయిన మమితా బైజును ఫైనల్ చేశారు. ప్రేమలు తర్వాత మమితకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో టాలీవుడ్ లో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం తమిళ్ తో పాటు తెలుగులోనూ తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ తో రొమాన్స్ అంటే ఒకే సినిమాతో రెండు భాషల్లో ఇంపాక్ట్ చూపించే అవకాశం మమితకు వచ్చిందనే చెప్పాలి.

Tags

Next Story